లలితా జువెలర్స్ యాడ్ తో విసిగిపోయిన జనాలువందలు, వేలు, దాటి లక్షలకు చేరిన బాధితులుయాడ్ చూడలేక లబోదిబోమంటున్న ప్రేక్షకులులలితా జువెలర్స్ యాడ్ పై సోషల్ మీడియాలో కౌంటర్లు యాడ్ కు పోటీగా లలితా హెయిర్ స్టయిల్ సృష్టి 

తెలుగు మీడియా ప్రపంచంలో లలితా జ్యెవెలర్స్ యాడ్ (వాణిజ్య ప్రకటన) సరికొత్త సునామీ సృష్టిస్తోంది. ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చదివినా, ఏ రేడియో విన్నా, ఎక్కడ చూసినా లలిత జ్యువెలర్స్ యాడ్ ప్రత్యక్షమవుతుంది. ఆ యాడ్ కోసం ఆ సంస్థ వాళ్లు ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో ఏమో కానీ నిమిష నిమిషానికి, అడుగు అడుగునా ఆ యాడ్ దర్శనమిస్తోంది.

ఆ యాడ్ లో వచ్చే ఒక నిగనిగలాడే గుండుతో ఉన్న వ్యక్తి మాటలు వినలేక తెలుగు నేల మీద బాధితులు వందలు, వేలు దాటి లక్షల సంఖ్యకు చేరిపోయారు. ఇక ఆ బాధ తట్టుకోలేక కొందరు బాధితులు కౌంటర్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో తమ ఆవేదన, బాధను వెల్లగక్కుతున్నారు. వారి ఆక్రందనల్లోంచి పుట్టుకొచ్చిందే లలిత హెయిర్ స్టైల్.

అది ఎలా ఉందో కింద చదవండి.

హెయిర్ స్టయిల్ ధరలు కంపార్ చేసేటప్పుడు ఈ ఫ్యాషన్ రేటు అలా వుంది.. ఆ హెయిర్ కట్ ఇంత ప్రైస్ అవుతుందని సెలూన్ షాపువాళ్లు కన్ ఫ్యూజ్ చేస్తున్నారా? అయితే లలితా జువెల్రీకి రండి! నా గుండుని చూడండి! ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్ స్లిప్ తీసుకోండి! వీలైతే నా తలని మొబైల్లో ఒక ఫోటో తీసుకోండి! రెండింటిని పెట్టుకుని నాలుగైదు సెలూన్ షాపులు తిరిగి, ధర కంపార్ చేయండి!! ఎక్కడ రేటు తక్కువగా ఉంటే అక్కడే గుండు గీయించుకోండి! డబ్బులు ఈజీగా రావు! ఇంతవరకు మీరు బొచ్చుమీద ఖర్చుపెట్టింది చాలు!!

ప్రస్తుతం లలిత యాడ్ కంటే లలితా గుండు పోస్టు సోషల్ మీడియాలో భలేగా చక్కర్లు కొడుతున్నది. మొత్తానికి నెటిజన్లు నా మజాకా అనిపించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి