ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసేవారే ఆయనకు నిజమైన వారసులని వైసీపీ నేత లక్ష్మీపార్వతి చెప్పారు.ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైద్రాబద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.  ఎన్టీఆర్  కడుపున పుట్టినంత మాత్రాన వారిని ఆయన వారసులు కాదన్నారు. ఆయన  ఆశయాలను అమలు చేసే వారే నిజమైన వారసులని  ఆమె తేల్చి చెప్పారు. 

హైదరాబాద్: ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసేవారే ఆయనకు నిజమైన వారసులని వైసీపీ నేత లక్ష్మీపార్వతి చెప్పారు.ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైద్రాబద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ కడుపున పుట్టినంత మాత్రాన వారిని ఆయన వారసులు కాదన్నారు. ఆయన ఆశయాలను అమలు చేసే వారే నిజమైన వారసులని ఆమె తేల్చి చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:ఎన్టీఆర్‌ యుగపురుషుడు.. ఆయనపై పుస్తకం రావాలిః తండ్రికి బాలకృష్ణ నివాళి

సూర్యచంద్రులున్నంతవరకు ఎన్టీఆర్ జనంతోనే ఉంటారని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను ఏపీ రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు.ఏపీ రాష్ట్రంలో జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మెన్ గా నియమించారు. ఎన్నికల సమయంలో కూడ ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో జగన్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో కూడ లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి సందర్భంగా హైద్రాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పిస్తారు.