ప్రసాదం కాంప్లెక్స్లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషిన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకు వచ్చే విధంగా పనులు పూర్తి చేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషిన్ బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటార్లతో బెల్ట్ ను బిగించారు.
యాదగిరిగుట్ట : Yadadri Sri Lakshmi Narasimha Swamyని దర్శించే భక్తులందరికీ దేశంలోనే తొలిసారిగా.. Modern machineryతో.. మానవ ప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం అందనుంది. మార్చి 28న లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలోPrasadam తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రోజుకు 70 వేలకు పైగా లడ్డూలు, నాలుగు సార్లు ఒకేసారి 1000 కిలోల పులిహోర తయారు చేసే రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు. పులిహోరను ప్యాకింగ్ చేసేందుకు సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు.
ప్రత్యేక మెషిన్ లు…
ప్రసాదం కాంప్లెక్స్లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషిన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకు వచ్చే విధంగా పనులు పూర్తి చేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషిన్ బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటార్లతో బెల్ట్ ను బిగించారు. ట్రేలలో ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషిన్ వద్దకు తీసుకెళ్లేందుకు బెల్ట్ ను బిగించారు.
భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా పదమూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. యాదాద్రీశుడి ప్రసాదం తయారీని అధికారులు హరికృష్ణ మూమెంట్ ప్రతినిధులకు అప్పగించగా.. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ నెలలో ప్రసాదం నాణ్యత పరిశీలించారు. మంగళవారం మూడో సారి ట్రై చేశారు, ప్రస్తుతం దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు ప్రసాదం తయారీలో శిక్షణ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోకి ప్రముఖ దేవాలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. వందల కోట్లు ఖర్చుచేసి ఈ ఆలయాన్ని సర్వాంగసుందరంగా నిర్మించిన ప్రభుత్వం ఈ పవిత్ర కార్యంలో భక్తులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవాలయం తరహాలో ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ అందుకోసం భక్తులనుండే బంగారాన్ని సేకరించనున్నట్లు ప్రకటించారు.
వాట్సాప్ డీపీగా భార్యాభర్తల ఫొటో పెట్టుకున్నారా? అయితే డేంజరే.. జాగ్రత్త అంటున్న పోలీసులు..
CM KCR పిలుపుమేరకు Yadadri temple యాదాద్రి ఆలయానికి భారీగా బంగారాన్ని అందించాలని మంత్రి చామకూర మల్లారెడ్డి నిర్ణయించారు. ఇందులోభాగంగా మల్లారెడ్డి కుటుంబం తరపునే కాదు వ్యాపారసంస్థల తరపున బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. అయితే తాను ప్రాతినిధ్యంవహిస్తున్న మేడ్చల్ జిల్లా తరపున కూడా యాదాద్రి ఆలయానికి 11కిలోల బంగారాన్ని విరాళంగా అందివ్వనున్నట్లు minister mallareddy ప్రకటించారు.
ఇందులో భాగంగానే నవంబర్ 8న కుటుంబసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకున్న మల్లారెడ్డి.. నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏడు కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లను స్వామివారి సన్నిధిలోనే ఈవో గీతకు అందజేసారు. తొలి విడతలో అక్టోబర్ 28నే మంత్రి మల్లారెడ్డి మూడు కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83 కోట్లను విరాళం అందజేశారు. తాజాగా మరో ఏడున్నర కిలోలతో కలిసి మొత్తం 10 కిలోలకు గాను మొత్తం రూ.4.93 కోట్లు ఈవో గీతారెడ్డికి మంత్రి అప్పగించారు. త్వరలోనే మరో కేజీకి సంబంధించిన విరాళాలు ఆలయ అధికారులకు అందజేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
ఆయనతో పాటు అనేకమంది మంత్రులు, ఉద్యోగులు, అధికారులు.. సామాన్యులు తమ శక్తిమేరకు గోపురానికి విరాళాలు అందిస్తున్నారు.
