టీ. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. 

టీ. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

అంతకుముందు ఉదయం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉంటున్నానని, 2009లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందానని శ్రీశైలం గౌడ్ గుర్తుచేశారు.

Also Read:ఆ పరిణామాలు బాధ కల్గించాయి, కాంగ్రెస్ వైఫల్యం: కూన శ్రీశైలం గౌడ్

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడానని ... గత ఏడేండ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజాసమస్యలపై పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమయ్యిందని శ్రీశైలం గౌడ్ ఆరోపించారు.