Asianet News TeluguAsianet News Telugu

పోలీసులకూ వాస్తు భయమా ?

‘‘కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయాని, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’’. ఇది ఒక సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ ఉంది. ఆ కనిపించని నాలుగో సింహాలకు ఇప్పుడు వాస్తు భయం పట్టుకుంది. వాస్తు పేరుతో నానా హడావిడి చేస్తున్నారు. నిజానికి పోలీసులకు వాస్తు ఉంటుందా? వారికి వాస్తు భయం పట్టుకుంటే ఎలా?

kukunoorupalli police station is not vastu compliant

వాళ్లు పోలీసులు. చట్టాన్ని కంటికి రెప్పలా కాడాపాల్సిన సైనికులు. ప్రజల ధన, మాన ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాల్సిన యోధులు వారే. కానీ వారే భయపడిపోతే ? వారే అశాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా?

 

కుకునూరుపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది అక్కడ పోలీసుల ఆత్మహత్యలు. వరుసగా ఇద్దరు ఎస్సై లు ఆ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొన్నటికి మొన్న ఎస్సై ప్రభాకర్ రెడ్డి, అంతకుముందు మరో ఎస్సై రామకృష్ణారెడ్డి ఇద్దరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వరుస సంఘటనలు జరగడంతో పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. అయితే ఆ రెండు ఆత్మహత్యలకు వాస్తవిక కోణంలో కారణాలేంటనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాలి.

 

నిజానికి ఇద్దరు ఎస్సైలు ఆత్మార్పణం చేయడం వెనుక అసలైన ప్రధాన కారణం ఉన్నతాధికారుల వేధింపులే అన్నది జగమెరిగిన సత్యం. మామూళ్ల కోసం ప్రతి నెలా ఉన్నతాధికారుల నుంచి వేధింపుల ఫోన్ కాల్స్ వస్తుంటాయని ఇద్దరు ఎస్సైల కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రతి నెలా లక్షల్లో ఉన్నతాధికారులకు ముట్టచెప్పాలంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

 

కుకునూరుపల్లి పోలీసు స్టేషన్ మంచి కమర్సియల్ సెంటర్. జాతీయ రహదారి మీద ఉన్న పోలీసు స్టేషన్. ఆ పిఎస్ లిమిట్స్ పరిధిలో ఇసుక రవాణా పోలీసు పెద్దలకు కాసులు కురిపిస్తుందని ప్రచారంలో ఉంది. ప్రతి నెలా లక్షల్లో డబ్బులు పోలీసులకు అందుతుంటాయని సమాచారం. దీంతో ఆ పోలీసు స్టేషన్ లో ఎవరు పనిచేసినా వారిపై తీవ్రమైన వత్తిడి, వేధింపులు ఉంటాయి మామూళ్ల కోసమే అని చెబుతున్నారు.

 

ఇక కుకునూరుపల్లి పోలీసు స్టేసన్ ను 1996లో ప్రారంభించారు. రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఈ పోలీసు స్టేసన్ లో భాగమైన డాక్ బంగళాను రెండేళ్ల క్రితం కూల్చేశారు. అప్పటి నుంచి వాస్తుదోషం పట్టుకుందని పోలీసు వర్గాల్లో చర్చ ఉంది. ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడడం, మరో ఎస్సై కుటుంబసభ్యులకు రోడ్డు ప్రమాదం జరగడం వంటివి జరిగాయంటున్నారు.

 

ప్రభాకర్ రెడ్డి స్థానంలో కొత్తగా విధుల్లో చేరిన సంతోష్ కుమార్ సదరు పోలీసు స్టేసన్ లో స్వల్పంగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎస్సై గదిని గతంలో రైటర్ ఉండేచోటుకు తరలించారు. రైటర్ ఉండేగదిని ఎస్సై గదికి షిప్ట్ చేశారు. స్టేషన్ లోపల ఉన్న గోడలను కూల్చివేసి వాస్తుకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎస్సై నివాసముండే క్వార్టర్ కు, స్టేషన్ కు మధ్య ఉన్న గోడను కూల్చివేశారు.

 

మొత్తానికి వాస్తు లాంటి విషయాల్లో పోలీసులు కూడా భయపడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని జనవిజ్ఞాన వేదిక నేత రమేష్ అన్నారు. వాస్తు అనేది అశాస్త్రీయమైనదని, దానికి పోలీసులు దాసోహమనడం సరికాదన్నారు. ఇద్దరు ఎస్సైల ఆత్మహత్యలపై అసలు కారణాలను వాస్తవిక కోణంలో విచారించాలి తప్ప వాస్తు పేరుతో మార్పులు చేర్పులు చేయడం తగదన్నారు.

 

అయినా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులే వాస్తు పేరుతో హడావిడి చేస్తుంటే పోలీసులు కూడా అదే దారిలో నడుస్తున్నారని చెప్పారు. అందకే యదా రాజ.. తదా ప్రజ అని ఊరికే అనే సామెత ఊరికే రాలేదని, అది ఇప్పుడు రుజువైందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios