రేవంత్ కు కేటీఆర్ బామ్మార్ది షాక్

First Published 25, Nov 2017, 7:16 PM IST
KTRs  brother in law slaps legal notice on Revanth for his comments against his business
Highlights
  • డ్రగ్ మాఫియా కింగ్ ఆరోపణలపై నొచ్చుకున్న కేటిఆర్ బామ్మార్ది
  • రేవంత్ కు లీగల్ నోటీసులు పంపిన రాజేంద్ర ప్రసాద్ పాకాల
  • మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్

మాటిమాటికి తనపై డ్రగ్స్ మాఫియా కింగ్ అంటూ తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్ రెడ్డిపై కేటీఆర్ బామ్మార్ది రాజేంద్రప్రసాద్ పాకాల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనపై డ్రగ్ మాఫియా కింగ్ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి రాజేంద్ర ప్రసాద్ పాకాల తాజాగా ఐదు పేజీల లీగల్ నోటీసులు జారీ చేశారు.

శుక్రవారం జరిగిన సన్ బర్న్ షో సందర్భంగా రాజేంద్రప్రసాద్ పాకాలపై రేవంత్ విమర్శలు చేశారు. ఆ షో నిర్వహించేది రాజేంద్ర ప్రసాదే అని ఆరోపించారు. ఆ షో లో డ్రగ్స్ సరఫరా చేసే ప్రమాదముందని ఆరోపించారు రేవంత్. దాంతోపాటు గతంలోనూ డ్రగ్స్ కేసు బయట పడ్డప్పుడు కూడా రేవంత్ కేటీఆర్ ను విమర్శిస్తూ ఆయన బామ్మార్దిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీచేశారు కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్. తన వ్యాపారానికి సంబంధించి అసత్య ఆరోపణలు చేయడంతో పాటు ప్రభుత్వ పెద్దల పరువుతీస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు రాజేంద్రప్రసాద్. మీడియా సమక్షంలో వెంటనే క్షమాపణ చెప్పాలని పాకాల డిమాండ్ చేశారు. లేకపోతే రేవంత్ మీద క్రిమినల్ ఆక్షన్ తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు రాజేంద్రప్రసాద్.

ఇక రాజేంద్ర ప్రసాద్ మీదే కాకుండా రేవంత్ రెడ్డి రాజేంద్రప్రసాద్ సతీమణి సుమ పాకాల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. డ్రగ్ మాఫియా కింగ్ గా రాజేంద్ర ప్రసాద్ వెలుగొందుతుండగా డ్రగ్ మాఫియా క్వీన్ గా సుమ పాకాల నిలిచారని ఆరోపణలు గుప్పించారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసే హైదరాబాద్ లో డ్రగ్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు రేవంత్. హైదరాబాద్ లోని పబ్ లలో మైనర్లకు కూడా డ్రగ్ ను అలవాటు చేస్తున్నారని, ఈ తతంగంలో వీరిద్దరూ కీ రోల్ ప్లే చేస్తున్నారని కూడా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ పాకాల తీవ్ర ఆవేదనకు చెందినట్లు చెబుతున్నారు. బిజినెస్ మెన్ అయిన తనను, బిజినెస్ ఫ్యామిలీ అయిన తన కుటుంబాన్ని, తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన తన బావ కుటుంబాన్ని అవమానించేలా ఆరోపణలు చేయడంతోనే ఈ లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇక సుమ పాకాల కూడా లీగల్ నోటీసులు పంపుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ రేవంత్ రెడ్డికి రాజేంద్ర ప్రసాద్ పాకాల పంపిన లీగల్ నోటీసు కాపీ..

 

 

 

loader