Asianet News TeluguAsianet News Telugu

సీసీఐ ప్రారంభించాలని కేంద్ర మంత్రులకు లేఖ రాసిన కేటీఆర్

ఆదిలాబాద్ జిల్లాలో మూసివేసి ఉన్న సీసీఐ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించాలని కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ రాశారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడం వల్ల వెనకబడి ఉన్న ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

KTR wrote a letter to the Union Ministers to start CCI
Author
Hyderabad, First Published Jan 3, 2022, 11:26 AM IST

ఆదిలాబాద్‌లో ఉన్న సీసీఐ (సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా) ఫాక్ట‌రీని మ‌ళ్లీ ప్రారంభించాల‌ని మినిస్ట‌ర్ కేటీఆర్ కోరారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, మ‌హేంద్ర‌పాండేల‌కు ఆయ‌న లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఆదిలాబాద్‌లో ఉన్న సీసీఐ ఫ్యాక్ట‌రీ వివ‌రాల‌ను అందులో పొందుప‌ర్చారు. ఆదిలాబాద్ లో ఉన్న సీసీఐను ప్రారంభించాల‌ని ఎన్ని సార్లు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించ‌డం లేద‌ని అన్నారు. ఈ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల ఆదిలాబాద్‌లో ఉండే స్థానిక యువ‌త‌కు, గిరిజనుల‌తో పాటు ఎంతో మందికి ఉపాధి దొరుకుంతుంద‌ని అన్నారు. వెన‌క‌బ‌డి ఉన్న ఆదిలాబాద్ ప్రాంతానికి ఈ ఫ్యాక్ట‌రీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. 

కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్ట‌రీకి 772 ఎక‌రాల స్థ‌లం ఉంద‌ని అన్నారు. దీంతో పాటు 48 మిలియ‌న్ ట‌న్నుల రాయి ఉంద‌ని అన్నారు. ఈ సున్న‌పు రాయి నిల్వ‌లు 1500 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్నాయ‌ని తెలిపారు. ఇది సిమెంట్ త‌యారీకి ఎంతో ఉప‌యోక‌రంగా ఉంటుంద‌ని తెలిపారు. ఇప్పుడున్న సీసీఐ ఫ్యాక్ట‌రీకి క‌రెంటు సౌక‌ర్యం, నీటి సౌక‌ర్యం అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ ప్రాంతంలో మ‌ళ్లీ సిమెంటు ఉత్ప‌త్తి చేస్తే ఎంతో మందికి ప్ర‌త్య‌క్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంద‌ని అన్నారు. ఈ ఫ్యాక్ట‌రీ ప్రారంభిచండం వ‌ల్ల రాష్ట్రంలోని నిర్మాణ రంగానికే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లోని నిర్మాణాల‌కు కూడా ఎంతో ఉప‌యోగక‌రంగా ఉంటుంద‌ని అన్నారు. చుట్టు ప‌క్క‌ల ఉన్న స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌కు ఈ సిమెంట్ ను ఎగుమ‌తి చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. 

రాష్ట్రంలో నిర్మాణ రంగం మంచి జోష్ మీద ఉంద‌ని, ప్ర‌స్తుతం నిర్మాణాలు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని వాటి అవ‌స‌రాల‌కు ఈ సిమెంట్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం పరిశ్ర‌మ‌ల స్థాప‌న కోసం టీఎస్ ఐపాస్ వంటి అద్భుత‌మైన విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింద‌ని తెలిపారు. ఈ విధానం ద్వారా అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని అన్నారు. ఆదిలాబాద్ ప్రాంతాలో దేవాపూర్ ప్లాంట్ లో ఓరియంట్ సిమెంట్ కంపెనీ మ‌ళ్లీ కొత్త పెట్టుబ‌డులు పెట్టింద‌ని అన్నారు. రూ. 1500 కోట్ల‌తో ఆ ప్లాంట్ లో ఉత్ప‌త్తిని రెండింత‌లు చేసింద‌ని చెప్పారు. ఆదిలాబాద్ లోని సీసీఐ ప్రారంభించాల‌ని గ‌తంలో ఎన్నో సార్లు విజ్ఞ‌ప్తి చేశామ‌ని తెలిపారు. గ‌త కేంద్ర మంత్రులకు ఎన్నో సార్లు విన్నవించామ‌ని తెలిపారు. అయినా కేంద్ర ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని అన్నారు. 

తెలంగాణలో 1,014 సెంటర్లలో పిల్లలకు టీకాలు.. పిల్లలు భయపడాల్సిన పనిలేదని చెప్పిన హరీష్ రావు..

ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్ట‌రీ ప్రారంభించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు వ‌స్తే, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని తెలిపారు. కాబ‌ట్టి సిమెంటు ఉత్ప‌త్తి చేయ‌డం ద్వారా లాభాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ఆదిలాబాద్‌లో సిమెంట్ ఉత్ప‌త్తి చేసి, దానిని ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా ఎగుమ‌తి చేయ‌వ‌చ్చ‌ని సూచించారు.ఇప్ప‌టికే ఇక్క‌డ ఉన్న సిమెంట్ కంపెనీలు లాభాలు గ‌డిస్తున్నాయ‌ని చెప్పారు. సీసీఐ ప్రారంభించి సిమెంట్ ఉత్ప‌త్తి చేస్తే క‌చ్చితంగా లాభాలు వ‌స్తాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం స్పందింది, సీసీఐ ప్రారంభించాల‌ని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios