తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి శుక్రవారం నాడు లేఖ రాశారు. బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు వంచన యాత్ర అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్: Bandi Sanjay ది ప్రజా వంచన యాత్ర అని తెలంగాణ రాష్ట్ర మంత్రి KTR విమర్శించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు బహిరంగ letter రాశారు.జుటాకోర్ పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్రగా కేటీఆర్ విమర్శించారు.
కృష్ణా జలాల్లో Telangana వాటాను కేంద్రం తేల్చడం లేదని ఆయన మండిపడ్డారు.Palamuru రైతులకు ద్రోహం చేస్తూ సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తున్నారా అని ఆయన బండి సంజయ్ ను ప్రశ్నించారు. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ఆయన అడిగారు.NITI AAYOG చెప్పినా కూడా నిధులిచ్చే నీతి లేదని కేటీఆర్ మండిపడ్డారు. .వరి రైతులను ముంచాలని చూశారని ఆయన విమర్శించారు.
కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు చేస్తున్నారని ఆయన బండి సంజయ్ యాత్రపై మండిపడ్డారు. కుట్రలు చేసినవాళ్లు ఇప్పుడు కపట యాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాలమూరుపై కక్ష ఎందుకో చెప్పాలని ఆయన కోరారు. విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదని కేంద్రంపై కేటీఆర్ ఫైరయ్యారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను గురువారం నాడు ఆలంపూర్ లోని జోగుళాంబ ఆలయం వద్ద ప్రారంభించారు. సుమారు నెల రోజుల పాటు రెండో విడత పాదయాత్ర సాగనుంది.
2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు. తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు. పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. రెండో విడత పాదయాత్ర పూర్తైన తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మరో విడత యాత్రను బండి సంజయ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు బండి సంజయ్. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, బీజేపీ వైఖరి ఏమిటనే విషయాలను కూడా ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తుంది. వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని బూచిగా చూపి పాదయాత్రను టీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని కూడా బీజేపీ అనుమానిస్తుంది. రాజకీయంగా పార్టీకి ఇబ్బందులు ఎదురు కాకుండా యాత్రను కొనసాగిస్తూనే రైతులకు టీఆర్ఎస్ వ్యవహరశైలిని కూడా వివరించాలని కమల దళం భావిస్తుంది.
2023 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పాదయాత్ర పినికి వస్తుందని కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేలను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు కమలదళం నేతలు.
