తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అనైతికంగా మాట్లాడితే.. తమ నాయకుడు కేసీఆర్ ఖండించారని కేటీఆర్ చెప్పారు. ‘రాజకీయాలకు అతీతంగా రాజ‌నీతిజ్ఞుడిగా రాజీవ్ గాంధీ గౌర‌వాన్ని సీఎం కేసీఆర్ కాపాడారు. మీ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మ‌ర‌ణాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ జీ మీరు అత్యంత నీచమైన వ్యక్తిని ఎంచుకున్నారు. అత‌ను త్వ‌ర‌గానే కోలుకుంటాడ‌ని ఆశిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. కేసీఆర్‌ను విమ‌ర్శిస్తే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి ఇదేనా నీ సంస్కృతి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

Scroll to load tweet…

రాష్ట్రంలోని పలుచోట్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నిర‌స‌న ప్ర‌దర్శ‌న‌లు చేప‌ట్టారు. ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ నాయ‌కులు.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ‌ను గాడిద‌పై ఊరేగించి ద‌హ‌నం చేశారు. బంజారాహిల్స్‌లోని బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి వ‌ద్ద ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు.