కెటిఆర్ చేతిలోకి టిఆర్ ఎస్ పగ్గాలు

KTR to take over party reins in next TRS Plenary scheduled in April
Highlights

జిహెచ్ ఎం సి ఎన్నికల మాదిరిగా  కెటిఆర్ సారథ్యం లోనే  2019  ఎన్నికల పోరాటం

తెలంగాణ రాష్ట్ర సమితి రూపు మారిపోతున్నది. మీడియా కథనాల ప్రకారం పార్టీ నాయకత్వం మెల్లిగా ముఖ్యమంత్రి కుమారుడు, ఐటి మంత్రి తారకరామారావు(కెటిఆర్ )చేతుల్లోకి వెళుతూ ఉంది.తొందర్లో ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించునున్నారు.

 

పార్టీ కెటిఆర్ నాయకత్వంలో   2019 ఎన్నికలలో తలపడేవిధంగా పార్టీ నిర్మాణం మారిపోతున్నదని చెబుతున్నారు.  2019లో పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్ కెసిఆర్ వారసుడిగా కెటిఆర్ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి,దీనికి రంగం సిద్ధం చేసేందుకు యువరాజునే యుద్ధానికి పంపి జయించుకు రమ్మని కెసిఆర్ యోచిస్తున్నట్లు పత్రికల్లో వార్తలొస్తున్నాయి.

 

కెటిఆర్ తన శక్తి సామర్థ్యాలను చాలా సార్లు రుజువు చేసుకున్నాడు.  ముఖ్యమంత్రి కెసిఆరే ఆయినా, రాష్ట్రంలో మోస్ట విజిబుల్ రాజకీయ నాయకుడు కెటిఆర్. కెసిఆర్ కొడుకు కాబట్టే  ఒక వెలుగు వెలుగుతున్నాడనే అపవాదు ఆయనకు అంటుకోకుండా, చాలా తొందరగా కెటిఆర్ స్వతంత్రుడయ్యాడు. దానికి కెటిఆర్ నాయకత్వం ఎలా ఉంటుందో గత జిహెచ్ ఎంసి ఎన్నికలలో టిఆర్ ఎస్ కు అఖండ విజయం సాధించి చూపించారు.


వర్కింగ్ ప్రెశిడెంట్ పోస్టు ప్రస్తుతం పార్టీ లేదు. మొదట ఈ పోస్టులో  ఆలే నరేంద్ర ఉన్నారు. తన పార్టీని టిఆర్ ఎస్ లో విలీనం చేసినుందకు ప్రతిఫలంగా నరేంద్రను కసిఆర్ వర్కింగ్ ప్రెశిడెంట్ గా నియమించారు. ఆచాప్టర్ చాలా త్వరగా ముగిసింది.

 

పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పగించేముందు కెటిఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంటు గానో లేదా  ప్రధాన కార్యదర్శిగా నో నియమిస్తారని చెబుతున్నారు.

 

నిజానికి ఇపుడే ఆయన అనధికారిక ముఖ్యమంత్రిగా ఉన్నట్లు లెక్క. కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అనేదానికి  సర్వత్రా గుర్తింపు వచ్చింది. తెలంగాణా ముఖ్యమంత్రి సందర్శించేందుకు వచ్చిన విదేశీ ప్రముఖులంతా  కెటిఆర్ ను కూడా కలసి వెళుతున్నారు. పార్టీలో ఇప్పటికే ఆయన ముందు ముందు ఏ బాధ్యతల్లో ఉంటారనే దాని మీద చాలా స్పష్టతం వచ్చింది.

 

ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ లో ఈ ఆయన పార్టీ పదవి ఖరారవుతుందని చెబుతున్నారు.  ఆ తరువాత ఏప్రిల్ 27న వరంగల్‌లో బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు ఈ నియామకాన్ని ప్రకటించి  ప్రజలకు లాంఛనంగా పరిచయం చేస్తాడని అంటున్నారు.

 

(చివరకు ఆంధ్ర యువరాజు నారా లోకేష్ కు కెటిఆర్ బెంచ్ మార్క్ అయ్యాడు. అయితే, ఆయనకు మొదటి దెబ్బ జిహెచ్ ఎంసి ఎన్నికల్లోనే తగిలింది. టిడిపి కోలుకోలేనంత గా పరాజయం పాలయింది. ఆ తర్వాతే టిడిపి వాళ్ల పిరాయింపులెక్కు వయ్యాయి. ఇపుడు ఆయన కూడ కెటిఆర్ లాగా క్యాబినెట్ లోకి ఎంటరయి, మంత్రిగా మంచి పేరుతెచ్చుని వారసత్వం వివాదాస్పదం కాకుండా ఉండేందుకు  కష్టించి పనిచేయాలనుకుంటున్నారు.)

loader