Asianet News TeluguAsianet News Telugu

శశి థరూర్ మీద కేటీఆర్ సెటైర్ ... దెబ్బకు కేటీఆర్ తో దేవుడా అనిపించిన థరూర్

తాజాగా కేటీఆర్ ఈ పలకారని మందులకు పేర్లు పెట్టడం వెనుక శశి థరూర్ హస్తం ఉందేమో అని ఫన్నీ గా ట్వీట్ చేసారు. దీనికి శశి థరూర్ తనదైన స్టయిల్ లో అతి క్లిష్టమైన ఇంగ్లీష్ పదాలతో కూడిన ట్వీట్ తో కేటీఆర్ కి సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు.

KTR suspects Shashi Tharoor's hand in naming drugs: KCR's Son in search of dictionary after Tharoor's Epic reply
Author
Hyderabad, First Published May 21, 2021, 7:14 PM IST

ఈ కరోనా కాలంలో వివిధ రకాల మందుల పేర్లను మనం నిత్యం వింటూనే ఉన్నాం. కొన్నిసార్లు అవి పలకడానికి కూడా నానా ఇబ్బందులను పడుతున్నాం. ఈ కరోనా మహమ్మారి మనకు పరిచయం అయినప్పటినుండి రెమెడిసివిర్, టోకిలీజుమాబ్ మందుల గురించి జనాలు మెడికల్ షాపుల చుట్టూ తిరగడం, వాటి గురించి సోషల్ మీడియా వేదికగా మంత్రులను రిక్వెస్ట్ చేయడం నిత్యకృత్యంగా మారింది. 

ఇక బ్లాక్ ఫంగస్ కేసులు కూడా మొదలయ్యాక అంఫోటెరిసిన్ మందు పేరుకూడా వింటున్నాం. ఇవే కాక ఇంకా చాలా మందులను కూడా డాక్టర్లు ఇప్పుడు పేషెంట్స్ కి రాస్తుండడంతో అవి మార్కెట్లో అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణాలో మందుల కోసం చాలా మంది ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ని టాగ్ చేస్తున్నారు. తనకు వీలైనంతమేర వారికి సహాయం చేస్తున్నారు కేటీఆర్. 

ఇక తాజాగా కేటీఆర్ ఈ పలకారని మందులకు పేర్లు పెట్టడం వెనుక శశి థరూర్ హస్తం ఉందేమో అని ఫన్నీ గా ట్వీట్ చేసారు. ప్రపంచంలోనే ఇంగ్లీష్ భాషలోని అత్యంత క్లిష్ట పదాలను ఆశువుగా వాడగల అతి కొద్దీ మంది వ్యక్తుల్లో థరూర్ ఒకరు. భారతదేశంలో బహుశా ఆయనకు సాటి రంగాలవారు లేరేమో. దీనితో ఫన్నీగా కేటీఆర్ ట్వీట్ చేసారు. 

ఇక దీనికి శశి థరూర్ తనదైన స్టయిల్ లో అతి క్లిష్టమైన ఇంగ్లీష్ పదాలతో కూడిన ట్వీట్ తో కేటీఆర్ కి సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్ లోని పదాన్ని మనం పలకాలంటేనే దాదాపుగా 10 నిముషాల సమయం పడుతుంది. ఆ ట్వీట్ లోని పదాల్ని చూసిన కేటీఆర్ ఒక్కసారిగా దేవుడా అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవాలంటే డిక్షనరీ సహాయం తీసుకోవాల్సిందే అంటూ రిప్లై ఇచ్చారు కేటీఆర్. 

శశి థరూర్ ఇచ్చిన రిప్లై కి అర్థం ఏమిటంటే... ఈ మందుల పేర్ల వెనుక నా హస్తం లేదు. నేను అంత పనికిమాలిన వాడిని కాదు. ఒక వేళ నన్ను పేర్లు పెట్టమంటే కొరొనిల్, కొరో జీరో, ఇంకా ఎక్కువ మాట్లాడితే గో కరోనా గో అని పెడతాను అంటూ పనిలో పనిగా బాబా రాందేవ్ కొరొనిల్ పైన, బీజేపీ నేతల నినాదాలపైన కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ సైతం ఆ కొరొనిల్ సెటైర్ నచ్చిందనడం విశేషం. 

ఇంతకీ ఈ 'floccinaucinihilipilification' పదానికి అర్థం ఏమిటని అనుకుంటున్నారా... పనికిమాలిన దానిగా లెక్కగట్టే చర్య. ఈ పదాన్ని 'ఫ్లాక్సినాసిఇనిహిలిపిలిఫికేషన్' అని పలకాలి. మీరు కూడా ఈ పదాన్ని పలకడం ట్రై చేయండి. త్వరలో 'లెర్న్ ఇంగ్లీష్ విత్ శశి థరూర్ ట్వీట్స్' అనే ఒక కొత్త ఆన్లైన్ కోర్స్ ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios