సిరిసిల్ల వారికి మంత్రి కేటీఆర్ షాక్

First Published 4, Jan 2018, 6:23 PM IST
ktr surprise visit in sircilla district
Highlights
  • ఆకస్మిక పర్యటనలో జనాలు సరేషాన్
  • అధికారులు టెన్షన్ టెన్షన్
  • డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై అసంతృప్తి

సిరిసిల్ల జిల్లా ప్రజలకు, ఆ జిల్లా అధికార యంత్రాంగానికి, పార్టీ లీడర్లకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటిఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లా ముఖ్య నాయకులు, ఇతర అధికారులతో ముందస్తు సమాచారం లేకుండానే మంత్రి పర్యటనకు వెళ్లారు.

జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులను తనిఖీ చేశారు. తంగళ్లపల్లి మండలంలోని, మండళ్లపల్లి శివారులో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను పరిశీలించారు. పనుల జాప్యంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జల్లా కేంద్రం సిరిసిల్లకు వెళ్లి రోడ్ల వెడల్పు పనులను పరిశీలించారు. మంత్రి ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది.

ఎలాంటి సమాచారం లేకుండా మంత్రి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించడంతో జనాలు ఆశ్చర్యపోయారు. మంత్రి పర్యటన పై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

loader