Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ పెళ్లిపై కేటిఆర్ పంచ్

  • చంద్రబాబు చాలా సీనియర్
  • ఉత్తమ్ ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
  • కేంద్ర బడ్జెట్ లో ఒరిగిందేం లేదు
  • పనిపాట లేక కాంగ్రెస్ విమర్శలు
ktr strong punch on rahul gandhi s marriage

రాహుల్ గాంధీ పెళ్లి పై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ సెటైర్ వేశారు. అలాగే తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేటిఆర్ ఫైర్ అయ్యారు. మీడియాతో చిట్ చాట్ చేసిన కేటిఆర్ పలు అంశాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కేటిఆర్ ఏమన్నారో కింద చదవండి.

కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి ఒరిగింది ఏమి లేదు..2014 లో కాంగ్రెస్ లో టిఆర్ ఎస్ విలీనం అన్నప్పుడు ఇక నేను రాజకీయాలు వదిలి వెళ్దాం అనుకున్నాను. పనీ పాటా లేకనే కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు నాకు మధ్య సఖ్యత లేదంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు వాళ్ళు టచ్ లో ఉన్నారు అని చెప్పడానికి నేనేం ఉత్తమ్ ని కాదు. కేసీఆర్ తో పోల్చుకునే సినిమా ఉత్తమ్ కు లేదు...అలా అంటే రాహుల్ కూడా బచ్చా..నాకు కనీసం పెళ్లి అయింది. ఆయనకు పెళ్లి కూడా కూడా లేదు.

ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సిట్టింగ్ ల మీద ఆరోపణలు కామన్. జిఎహెచ్ ఎంసీ అభివృద్ధి ఒక్క రాత్రి లో జరిగేది కాదు. అది నిత్య ప్రక్రియ. చాలా గొప్ప అభివృద్ధి జరగబోతుంది. చంద్రబాబు 14 సార్లు దావోస్ సదస్సులో పాల్గొన్నారు.. నేను ఇదే మొదటి సారి...ఆయన చాలా సీనియర్. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మేము గెలవకుంటే నేను రాజీనామా చేస్తా అని సవాల్ విసిరితే ఎవరు ముందుకు రాలేదు. పాలేరు ఉప ఎన్నికలో కూడా నా సవాల్ కి ఎవరు ముందుకు రాలేదు. తెలంగాణ  ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను తిప్పికొట్టి పంపారు.

తాడు, బొంగరం ఏది లేకుండా కాంగ్రెస్ నాయకులు గాలి మాటలు మాట్లాడుతున్నారు. గద్వాల్ లో నా రాజకీయ భవిష్యత్తు ను ఫణంగా పెట్టి ఉత్తమ్ కు సవాల్ విసిరాను. అయినా ఆయన కుటుంబం గురించి మాట్లాడుతూ చీఫ్ ట్రిక్స్ చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నా సవాల్ కు నిలబడకపోయినా.. ఇప్పటికీ నేను మా మాట మీద నిలబడి ఉన్నాను. 2019 లో అధికారం లోకి రాకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటా. ఉత్తమ్ లా కుటుంబాలు,గుడారాల చాటున దాక్కోను. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన ఫలితం నల్గొండ ఫ్లోరోసిస్. రైతులకు పెట్టుబడి ఇవ్వడమ్ మొదలు పెట్టకా మా బలం పెరుగుతుంది. దాని దెబ్బ ఎలా ఉంటుందో ఉత్తమ్ కు అప్పుడు తెలుస్తోంది. 2014 లో సింగిల్ గా వచ్చాం 2019 లో కూడా సింగిల్ గానే వస్తాం. 2014 కంటే బలంగా అధికారం లోకి వస్తాం.

2004 నుండి 2014 వరకు ఈ దద్దమ్మలే కదా పాలించింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఈ దేశం లో రాహుల్ కంటే పెద్ద పప్పు ఎవ్వరు లేరు. గూగుల్ లో టైప్ చేయండి పప్పు ఎవరో తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఇస్యూ లు లేవు. పదవుల కోసం నరహంతకులుగా మారిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత మనుషులను చంపిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ లో ఇంత మంది యువకులు, ప్రజలు చనిపోయింది ఎవరి వళ్ళ తెలియదా? కాంగ్రెస్ పార్టీ పెద్ద లోఫర్ పార్టీ. 1991 హైదరాబాద్ లో చేసిన నరమేధాన్ని మరచిపోయి నల్గొండ మర్డర్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నిజంగా అంత స్ట్రాంగ్ గా ఉంటే ఉత్తమ్ నా ఛాలెంజ్ ఆక్సిఫ్ట్ చెయ్యాలి. కోదండరామే కాదు పవన్కళ్యాన్ ఎవరయినా పార్టీ పెట్టు కోవచ్చు.

క్యాబినెట్ లో ఉన్న  మంత్రులే కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇక మిగితా వాళ్ళను ఎలా మెప్పిస్తారు. ఇంత దారుణమయిన బడ్జెట్ పెట్టి ఎవరిని మెప్పిస్తారు? కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు బాహుబలి కి వచ్చిన కలెక్షన్స్ అన్ని డబ్బులు కూడా రాలేవు. కేంద్రం నుండి మంత్రులు, అధికారులు రాష్ట్రానికి వస్తున్నారు పొగుడుతున్నారు పోతున్నారు కాని ఏమి ఇవ్వడం లేదు. హక్కుగా రావాల్సిన దానికంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వడం లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదు. ప్రభుత్వం లో ఉన్నవాళ్లు(టీడీపీ) కొట్లాడితేనే ఇవ్వడం లేదు ఇక మాకేం ఇస్తారు. ప్రజలకే వివరిస్తాం. ఇష్టం ఉన్నా లేకున్నా ఆయనే 2019 వరకు ప్రధాని కదా.

తెలంగాణ నుండి ఉన్న ఒక్క దత్తాత్రేయ ను కూడా తీసేసారు..కిషన్ రెడ్డి అంబేర్ పేట్, లక్ష్మణ్ ముషీరాబాద్ దాటి బయటకు రారు..అమిత్ షా వచ్చి ఏం చేస్తాడు? ఈదేశంలో జాతీయ పార్టీ లు లేవు...దక్షిణాది లో ఉనికి లేని బీజేపీ  పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుంది? గుజరాత్ లో అందరి ముందు మొకరిల్లి విజయ్ రూపానిని ఓడించలేదు. అమేథీ లో మున్సిపల్ ఎన్నికలు గెలువలేదు మరి ఎవరు పప్పు? నేను సవాల్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు.