Asianet News TeluguAsianet News Telugu

బిజెపి రాజాసింగ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటు రిప్లై

. ఈ వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

KTR Strong Counter to BJP MLA Raja singh
Author
Hyderabad, First Published Oct 23, 2021, 11:20 AM IST

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలకు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు రిప్లై ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం .. హైదరాబాద్‌లో వర్ష పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనతో పాటు మంత్రి కేటీఆర్ బైక్ రైడింగ్‌కు రావాలని కోరారు. వర్షం పడుతున్న వేళ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తానన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అసెంబ్లీలో మాటలకే పరిమితమని వాస్తవం మాత్రం చాలా ఘోరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే ధనిక రాష్ట్రమని ప్రజలకు కాదని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.

Also Read: కేసీఆర్ బిగ్ ప్లాన్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఫోకస్

కాగా.. ఈ వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ముందు వాటి గురించి ప్రజల అభిప్రాయాలను అడగండి అంటూ.. కేటీఆర్ రాజాసింగ్ కి సూచించారు,

 

‘పెట్రల్ బంక్ కి వెళ్లి.. అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ ఎలా పెరుగుతున్నాయో మీరు ఎందుకు తెలుసుకోకూడదు? అంతేకాదు.. సామాన్యుల ఇళ్లకు వెళ్లి.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరుగుతుందో కూడా అడగొచ్చు. దేశంలో gdp అంటే గ్యాస్, డీజిల్ పెట్రోల్ పెంచడమని అర్థమా..?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్న నేపథ్యంలో.. ముందు ఆ విషయాలను తెలుసుకోండంటూ గట్టిగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios