Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేటు యూనివర్సిటీలపై బీజేపీ తీరు సిగ్గుచేటు-కేటీఆర్

బీజేపీ ద్వంద్వ నీతిని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.
ktr slams bjp for opposing private universities bill

ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును బీజేపీ వ్యతిరేకించడం విడ్డూరమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ తీరు చూస్తే ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తాం అన్నట్టు ఉందని మండిపడ్డారు. బీజేపీ వ్యవహారశైలి తీవ్ర అక్షేపనీయమన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో స్థానికంగా (25శాతం) రిజర్వేషన్ పెట్టిన రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

 

బీజేపీ మొన్నటివరకు భాగస్వామిగా ఉన్న ఎపి ప్రభుత్వం అసలు లోకల్ రిజర్వేషన్ లేకుండానే ప్రయివేటు యూనివర్సిటీ బిల్ తీసుకొచ్చిందని, 21రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్సిటీ లు లేవా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అంటే రాష్ట్రానికి ఒక తీరుగా వ్యవహరిస్తోందా అని నిలదీశారు. ఇలా అయితే బీజేపీ జాతీయ పార్టీ కాదు పెద్ద సైజ్ ప్రాంతీయ పార్టీ అన్నారు.

 

పార్లమెంట్ లో మా ఎంపీలు రిజర్వేషన్ల పై పోరాటం చేయడాన్ని మేము తీసుకొచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ముడి పెట్టడం హాస్యాస్పదమన్నారు కేటీఆర్. మేం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడటం లేదు. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ల కోసం పోరాడుతున్నాం. అది కూడా తెలుసుకోకుండా రాష్ట్ర బీజేపీ మాట్లాడుతుందంటే వాళ్ల అవగాహన ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు వస్తే  ఉన్నత ప్రమాణాలున్న విద్యే కాకుండా..ఉపాది అవకాశాలు కూడా మెరుగుపడుతాయి...చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడమే కాకుండా యూనివర్సిటీ ఉన్న ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. బీజేపీ గుడ్డి విమర్శలు మానుకొని వాస్తవాలు మాట్లాడాలన్నారు మంత్రి కేటీఆర్.

Follow Us:
Download App:
  • android
  • ios