లైఫ్ సైన్సెస్ కేపిటల్ గా హైద్రాబాద్ అభివృద్ది చెందిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. థావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

థావోస్: Lifesciences మెడికల్ రంగానికి Hyderabad తన బలాన్ని మరింత పెంచుకుంటుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR చెప్పారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం WEF సమావేశంలో తెలంగాాణ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రసంగించారు. కరోనా సంక్షోభం సమయంలో లైఫ్ సైన్సెస్ Medical రంగానికి మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు.ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే భారత లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమన్నారు.

Scroll to load tweet…

Telangana ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలో జరిగిన అభివృద్ది, తీసుకు వచ్చిన సంస్కరణలపై కేటీఆర్ వివరించారు. లైఫ్ సైన్సెస్ కేపిటల్ గా Hyderabad అభివృద్ది చెందిందన్నారు. దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోని అతి పెద్ద Pharma సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం నుండి సరైన మద్దతు లభించడం లేదని ఆయన చెప్పారు.