Asianet News TeluguAsianet News Telugu

మత చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ యత్నం: కేటీఆర్ ఫైర్

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. అప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూడనుందన్నారు. 
 

KTR Serious Comments on BJP in Hyderabad
Author
Hyderabad, First Published Apr 13, 2022, 1:45 PM IST

హైదరాబాద్: ట్రిఫైడ్ పథకంలో వడ్డీ రేటను  నాలుగు శాతానికి తగ్గిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

బుధవారం నాడు ఓ హోటల్‌లో నిర్వహించిన Ambedkar జన్మదిన వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి KTR  పాల్గొన్నారు. టాలెంట్ ఎవరి అబ్బసొత్తు కాదన్నారు. ప్రపంచంలో రెండే రెండు కులాలున్నాయన్నారు. ఒకటి డబ్బున్న కులం, మరోటి డబ్బు లేని వారి కులం అని కేటీఆర్ చెప్పారు. Dalitha Bandhu పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 17,700 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దళిత బంధు పథకంపై కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విపక్షాలపై కేటీఆర్ సెటైర్లు వేశారు.

మత చిచ్చుపెట్టి  రాజకీయంగా లబ్ది పొందాలని BJP  ప్రయత్నాలు చేస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎవరేం తినాలో ఏం తినొద్దో కూడా బీజేపీ చెబుతుందన్నారు. బీజేపీ దిక్కుమాలిన రాజకీయం చేస్తుందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

సమస్యలు ఏమున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.రైతు బంధు, రైతు భీమా, టిఫ్రైడ్ పథకాలు ఓ చరిత్ర అని ఆయన చెప్పారు.10 మందికి అవకాశాలను కల్పించే వ్యక్తులు ప్రోత్సహించాలని కేటీఆర్ చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios