వరంగల్: భూపాలపల్లి జిల్లా కందనపల్లి గ్రామంలోని వాగులో 12 మంది రైతులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారిని కాపాడేందుకు తెలంగాణ మంత్రి కేటీ రామారావు హెలికాప్టర్ పంపించారు. హెలికాప్టర్ సంఘటనా స్థలానికి చేరుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఫోన్ చేసి చెప్పడంతో కేటీఆర్ వెంటనే స్పందించి హెలికాప్టర్ ను పంపించారు.  

కాగా, సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సంఘటనా స్థలానికి హెలికాప్టర్ పంపించిన విషయాన్ని ఆయన ఎమ్మెల్యేతో చెప్పారు. తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా వానలు పడుతుండడంతో వాగులో చిక్కుకున్న రైతులు బయటకు రాలేకపోయారు. రైతులను కాపాడుతామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వారి కుటుంబ సభ్యులు భరోసా ఇచ్చారు.

రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామని, వాటిని వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు వాడుతామని కేసీఆర్ చెప్పారు. వరదల్లో చిక్కుకున్న 12 మంది రైతులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. రైతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. 

హైదరాబాదులో రెండు కంట్రోల్ రూంలను ఎర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు. మంత్రులు జిల్లాల్లో ఉండి వరద పరిస్థితులను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని కుందునపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటే ప్రయత్నంలో 12 మంది రైతులు అందులో చిక్కుకుపోయారు. 

రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామని, వాటిని వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు వాడుతామని కేసీఆర్ చెప్పారు. వరదల్లో చిక్కుకున్న 12 మంది రైతులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. రైతుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు.