ముందస్తు శాసనసభ ఎన్నికలపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలంగాణ మంత్రి కేటీ రామారావు చెప్పారు. అధికారాన్ని వదులుకునేందుకు సిద్దంగా న్నామని ఆయన అన్నారు. అందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్: ముందస్తు శాసనసభ ఎన్నికలపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలంగాణ మంత్రి కేటీ రామారావు చెప్పారు. అధికారాన్ని వదులుకునేందుకు సిద్దంగా న్నామని ఆయన అన్నారు. అందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. 

నాలుగున్నరేళ్లలో తాము ఏం చేశామో చెప్పేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతల దగుల్భాజీ ప్రేలాపనలను పట్టించుకోమని అన్నారు. తమది దోపిడీ సభ కాదని, ప్రజల మనసు దోచే సభ అని చెప్పారు. కాంగ్రెస్ మాదిరిగా తాము ప్రజల సొమ్మును దోచుకోలేదని అన్నారు. 

టీఆర్‌ఎస్‌ సమావేశంలో డబ్బులు పంచామని రేవంత్ అంటున్నారని, పెట్టెల్లో నోట్ల కట్టలు పెట్టడం రేవంత్‌కు తెలిసినంతగా తమకు తెలియదని అన్నారు. వాళ్ల బాసులు ఢిల్లీలో ఉన్నారని, తమ బాసులు గల్లీల్లో ఉన్నారని కేటీఆర్‌ అన్నారు.