ఏపీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని చంద్రబాబుకి అర్థమైందని అందుకే కొత్త డ్రామాలు మొదలుపెడుతున్నాడని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

ఏపీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని చంద్రబాబుకి అర్థమైందని అందుకే కొత్త డ్రామాలు మొదలుపెడుతున్నాడని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు నాయుడికి అర్థమైందని.. అందుకే పచ్చ మీడియాతో కలిసి కొత్త డ్రామాలకు తెర తీశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల మాటలు, ప్రవర్తనా తీరు చూస్తుంటే ఎన్నికల్లో వారికి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయని అర్థమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

ఫలితాలు వచ్చాక అనుసరించాల్సిన వ్యూహానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారని పేర్కొన్నారు. అందులో భాగంగానే యెల్లో మీడియాతో కలిసి ఎన్నడూ లేనంత హంగామా చేస్తున్నారని విమర్శించారు. 

Scroll to load tweet…

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి