ప్లీనరీలో కేటిఆర్ ఏం చేసిండో చూడండి (వీడియో)

First Published 28, Apr 2018, 2:55 PM IST
KTR's video TRS Plenary goes viral
Highlights

వైరల్ అయితున్న వీడియో

టిఆర్ఎస్ ప్లీనరీ హైదరాబాద్ లో అట్టహాసంగా సాగింది. దేశానికి దిశా, నిర్దేశం చేస్తామంటూ ఈ ప్లీనరీ వేదికగా సిఎం కేసిఆర్ ప్రకటించారు. దేశ రాజకీయాల్లో క్రియాశీ పాత్ర పోశిస్తామన్నారు. హైదరాబాద్ లో ఉండే భూకంపం పుట్టిస్తానని కూడా కేసిఆర్ ప్రకటించారు.

ఈ ప్లీనరీ వేదిక మీద కూర్చున్నవారిలో అందరి దృష్టి కేసిఆర్ కొడుకు మంత్రి కేటిఆర్ మీదే ఉంది. ఆయన పలువురు అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అయితే కొందరు వయసులో కేటిఆర్ కంటే పెద్దవారు వచ్చి ఆటోగ్రాఫ్ అడగడంతో కేటిఆర్ లేచి నిలబడి వారికి ఆటోగ్రాఫ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

మంత్రి హోదాలో ఉన్నప్పటికీ.. పెద్దవాళ్ల పట్ట కేటిఆర్ కు ఉన్న గౌరవం ఇలాంటిది అని పలువురు టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు తీసిన వీడియోను గులాబీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నాయి. పైన వీడియో ఉంది. ఒక లుక్కేయండి.

loader