మిషన్ భగీరథ అర్బన్  కార్యక్రమం పైన పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు సిడియంఏ కార్యాలయంలో అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో మంత్రి పనుల పురోగతిని సమీక్షించారు. ఏట్టి పరిస్ధితుల్లో నిర్ణీత గడువు లోపల మిషన్ భగీరథ(అర్భన్) పనులు పూర్తి కావాలన్నారు. త్వరలో పనులు పూర్తి అయ్యే పట్టణాల జాబితాను తయారు చేయాలన్నారు. దీంతోపాటు ప్రతి పట్టణంలో ఏఏ తేదిలోపల పనులు పూర్తి అవుతాయో తెలియజేయాలన్నారు. అమృత్ పథకం కింద ఉన్న 10 పట్టణాల్లో పనులు జరుగుతున్న తీరుని మంత్రి సమీక్షించారు. అన్ని అమృత్ పట్టణాల్లో పనులు ప్రారంభం అయ్యాయని, వేగం నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

 గడువులోపల పనులు పూర్తి చేసేందుకు అన్ని వర్కింగ్ ఏజెన్సీలు వేగంగా పనిచేయాలన్నారు. గడువు లోపల పూర్తి చేసేందుకు అవసరం అయిన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం వైపు నుంచి వర్కింగ్ ఏజెన్సీలకు  అందించాలని అధికారులను అదేశించారు. గడువులోపల పూర్తి చేసే ఏజెన్సీలకు ప్రొత్సహాకాలు ఇస్తామన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి పనులను సేఫ్ స్టేజీకి తీసుకురావాలన్నారు. మనుగూరు పట్టణంలో పనులు దాదాపుగా పనులు పూర్తి అయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. దీంతోపాటు అర్మూర్  పట్టణంలోనూ పనులు 98 శాతం పూర్తయ్యాన్నారు. సిరిసిల్లా పట్టణంలోనూ సుమారు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని  తెలిపారు.

రాష్ట్రంలోని సగం నగర పాలికల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, రానున్న నాలుగైదు నెలల్లో పనులు పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి తెలిపారు. ఏక్కడైనా పనులు మందగించి ఉంటే, అయా పట్టణాల్లో ఉన్న సమస్యలను ఏప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అయా జిల్లా కలెక్టర్లతో వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారని మంత్రి తెలిపారు. త్వరలోనే మిషన్ భగీరథ( అర్భన్ )పైన వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులతో ఒక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని వారం, వారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు.
    ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, సిడియంఏ శ్రీదేవి, ఈయన్ సి ( పిఈ) ధన్ సింగ్, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు ఉన్నారు.