కొత్త తరం నేతలను తయారు చేస్తాం: సీనియర్లు పార్టీ వీడడంపై కేటీఆర్


పార్టీని క్షేత్రస్థాయిని బలోపేతం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు.

KTR Responds on  BRS Leaders planning on join in Congress lns


హైదరాబాద్: బీఆర్ఎస్‌ను ఆ పార్టీ కీలక నేతలు  వరుసగా వీడుతున్నారు.  పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు  కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో  సోషల్ మీడియా వేదికగా  ఆ పార్టీ నేత  కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు.

శూన్యం నుండి సునామీ సృష్టించి  అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించిన ధీశాలి మన కేసీఆర్ అంటూ  కేటీఆర్ వ్యాఖ్యానించారు.  
తెలంగాణ సాధన కోసం ఒక్కడుగా బయలుదేరి అనేక అవమానాలను ఎదుర్కొన్న విషయాన్ని కేటీఆర్  గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కుట్రలు, కుతతంత్రాలు, ద్రోహాలను కేసీఆర్ చేధించారని  ఆయన ప్రస్తావించారు.

14 ఏళ్ల పాటు పోరాటం చేసి  తెలంగాణను సాధించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులను కేసీఆర్ నింపారన్నారు.  బీఆర్ఎస్ ను ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారన్నారు. కొత్తతరం నాయకత్వాన్ని తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదామని  కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణలో  అధికారాన్ని కోల్పోయిన తర్వాత  బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు  వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు.  బీఆర్ఎస్ కు చెందిన  కొందరు  ప్రజా ప్రతినిధులు కూడ  కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో  పార్టీలో కొనసాగి అధికారం కోల్పోగానే  ఇతర పార్టీల్లో చేరడంపై  బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios