Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందించిన కేటీఆర్... ‘పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే’..

అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది మరోసారి నిరూపితమయ్యింది అన్నారు. ‘పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే’ Indian farmers దీనిని నిరంతర ఆందోళనతో తాము అనుకున్నది సాధించి నిరూపించారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 

KTR reaction on repeal of agricultural laws
Author
Hyderabad, First Published Nov 19, 2021, 11:46 AM IST

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీని మీద తెలంగాణ ఐటీ మంత్రి KTR స్పందించారు.

అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది మరోసారి నిరూపితమయ్యింది అన్నారు. ‘పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే’ Indian farmers దీనిని నిరంతర ఆందోళనతో తాము అనుకున్నది సాధించి నిరూపించారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 

కాగా, ఈ రోజు ఉదయం గురునానక్ జయంతి సందర్బంగా రైతులకు తీపి కబురు చెప్పారు ప్రధాని మోదీ. తాము ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న నిరసనలకు ఎట్టకేలకూ ప్రధాని దిగి వచ్చారు. ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెబుతూ గతేడాది కేంద్రం తీసుకుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధాని narendra modi ప్రకటించారు. 

farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాబోయే parliament winter session 2021లో దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రైతులందరినీ క్షమాపణ కోరుతున్నట్టుగా మోదీ చెప్పారు. రైతులు  ఆందోళన విరమించాలని కోరారు. కాగా, ఈ three farm laws  రద్దు చేయాలని గత ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇంకా PM Modi మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని చెప్పారు. బడ్జెట్‌లో రైతులకు కేటాయింపులు ఐదు  రెట్లు పెరిగాయని తెలిపారు. ‘మేము దేశంలోని గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేసాము. చిన్న రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు తీసుకొచ్చాం. రైతులకు బడ్జెట్ కేటాయింపులు ఐదు రెట్లు పెరిగాయి. మైక్రో ఇరిగేషన్‌కు కూడా రెట్టింపు నిధులు ఇచ్చాం’ అని మోదీ  తెలిపారు. 

చిన్న రైతుల సాధికారత, బలోపేతానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని.. ఇది రైతులు, ఆర్థికవేత్తలు, వ్యవసాయ నిపుణుల డిమాండ్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులకు సరసమైన ధరలకే విత్తనాలు, 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డుల వంటి సౌకర్యాలను అందించడానికి తాము కృషి చేసినట్టుగా చెప్పారు. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి ఇటువంటి అంశాలు దోహదపడ్డాయని వెల్లడించారు. తాము ఫసల్ బీమా  యోజనను  బలోపేతం చేశామని.. మరింత మంది రైతులను దాని కిందకు తీసుకొచ్చామని మోదీ అన్నారు. 

ఇక, పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు నవంబర్ 28, 2020 నుంచి ఢిల్లీ సరిహద్దు‌ల్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios