పదే పదే తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. మోదీ వ్యాఖ్యలు దిగ్బ్రాంతి కలిగించాయి: కేటీఆర్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని.. మోదీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. అయితే ఏపీ విభజనకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని.. మోదీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజ తీరును ప్రస్తావిస్తూ యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఏపీ విభజనకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సందర్భం కాదని.. చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారని.. ఎట్టకేలకు 2014 జూన్ 2న వారి కలను సాకారం చేసుకున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రావతరణ దిశగా సాగిన ప్రయాణం లెక్కలేనన్ని త్యాగాలతో కూడుకున్నదని చెప్పారు. తెలంగాణ యువకుల త్యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సి ఉంటుందని అన్నారు.
Also Read: ప్రజలు సంబరాలు చేసుకోలేదు.. పార్లమెంట్‌లో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన మోదీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదని అన్నారు. ఇందులో అజ్ఞానం, అహంకారంగా కూడా కనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నంలో ప్రధాని మోదీ పదే పదే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు అటువంటి సున్నితమైన చారిత్రక విషయాలపై అవగాహనతో మాట్లాడటం, వాటితో ముడిపడి ఉన్న భావోద్వేగాలు, త్యాగాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.