మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన  చాలా బాధాకరమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ ఘటన ఊదాహరణగా నిలుస్తాయని అన్నారు. 

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మే 4వ తేదీన జరిగినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మణిపూర్‌లో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ఘటనను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ ఘటన ఊదాహరణగా నిలుస్తాయని అన్నారు. 

భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నా కేంద్రం ఎందుకు మౌనంగా చూస్తోంది అంటూ ప్రశ్నించారు. మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

Scroll to load tweet…


‘‘తాలిబాన్‌లు పిల్లలను, మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు భారతీయులమైన మనం వారిపై విరుచుకుపడుతున్నాము. ఇప్పుడు మన దేశంలోనే మణిపూర్‌లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధకరం. కొత్త భారతదేశంలో అనాగరికత ఎలా సాధారణీకరించబడిందో బాధ కలిగించే ఈ ఘటనలు ఊదాహరణగా నిలుస్తాయి. ఈ భయానక హింసాకాండ, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోంది. మణిపూర్‌లో మానవత్వం మంటగలుస్తున్నప్పుడు.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎక్కడున్నారు. దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి, మీ సమయాన్ని మరియు శక్తిని మణిపూర్‌ను కాపాడేందుకు వినియోగించండి’’ అని కోరారు. 

ఇక, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చూసేందుకు పార్లమెంటు ఉభయ సభల్లో మణిపూర్ హింస అంశాన్ని లేవనెత్తుతారని మంత్రి కేటీఆర్ చెప్పారు. దారుణమైన వేధింపులకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం త్వరగా శిక్షించాలని కోరారు. మణిపూర్‌లో శాంతిని కోరుకునే వారంతా రాజకీయాలకు అతీతంగా నిలబడాలని అన్ని పార్టీలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.