Asianet News TeluguAsianet News Telugu

బల్లార్ పూర్ పరిశ్రమ పునరుద్ధరణకు కేటీఆర్ హామీ

తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి ప్రభుత్వమన్న ఆయన ఖాయిల పడిన బల్లార్ పూర్ లిమిటెడ్ పరిశ్రమ పునరుద్ధరణకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. 
 

KTR promises to revive Ballarpur unit
Author
Hyderabad, First Published Aug 30, 2018, 5:42 PM IST

హైదరాబాద్: తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి ప్రభుత్వమన్న ఆయన ఖాయిల పడిన బల్లార్ పూర్ లిమిటెడ్ పరిశ్రమ పునరుద్ధరణకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. 

పరిశ్రమల శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ పునరుద్ధరణపై పరిశ్రమ యాజమాన్యం, పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వారం రోజుల్లోగా పరిశ్రమ పునరుద్ధరణకు ప్రయత్నించాలని యాజమాన్యాన్ని కోరారు.  

ఖాయిల పడిన పరిశ్రమలను పునరుద్దరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఖాయిలపడ్డ బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం కోరిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తుదని మత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్ లో పరిశ్రమ యాజమాన్యానికి ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. 

పరిశ్రమను వారం రోజుల్లోగా పునరుద్దరించాలని అలాగే కార్మికులు యాజమాన్యానికి సహకరించాలని కేటీఆర్ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా వ్యవహరిస్తుందని, కార్మికుల బతుకులు బాగు చేయడమే తమ లక్ష్యమన్నారు. బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దడంలో భాగంగా ఖాయిల పడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 

పరిశ్రమను తిరిగి పునరుద్దరిస్తే కంపెనీ యాజమాన్యానికి ప్రభుత్వం తరపున మరిన్ని సబ్సీడీలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ హామీ ఇచ్చారు. కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని...కార్మికుల బతుకుదెరువు కోసం వెంటనే పరిశ్రమను తెరవాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios