ఢిల్లీ రోడ్లు అద్బుతమన్న మంత్రి కేటీఆర్ అక్కడి రోడ్లను ట్విట్టర్ లో పంచుకున్నారు.
తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ నేడు ఢిల్లీ టూర్ కి వెళ్లాడు. అందులో భాగంగా అక్కడ ఒక హోటళ్లో బస కోసం దిగారు. అక్కడ తన విండో నుండి కనిపించిన ఢిల్లీ రోడ్లను చూశారు. ఆ రోడ్లన్ని చాలా శుభ్రంగా ఉండటంతో ఆయన ఆ రోడ్లను ఫోటో తీసి తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అక్కడ ఉన్న రోడ్ల లాగే హైదరాబాద్ లో కూడా ఇలాగే ఉండాలని ఆయన కొరుకుంటున్నట్లు తెలిపారు.
ఆయన తన ట్విట్టర్ లో శుభ్రంగా ఉన్న రోడ్లను, కూడళ్లతో కూడిన రోడ్లను అందరితో పంచుకున్నారు. ఆ ఫోటోలకు ఇలా ట్యాగ్ చేశారు ఢిల్లీలోని నా గది నుండి చూడండి. అక్కడి రోడ్లు చాలా అందగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇలాంటి రోడ్లను చూడాలనుకుంటున్నాను అని ఆయన అన్నారు. స్వచ్చ్ భారత్ లో భాగంగా దేశ వ్యాప్తంగా పరుశుద్ద కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.
ఢిల్లీలో రోడ్లను మీరు కూడా ఓ లూక్కేయండి.
