హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి లో రాజకీయాలన్నీ యువ నేత కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నా  అన్నీ తానై కేటీఆర్ రాజకీయాలు ,ప్రభుత్వ పాలన పై దృష్టి సాధిస్తున్నారు.

 ఏడాది క్రితం గులాబీ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ ఆధిక్యతతో మరోసారి అధికార పగ్గాలు దక్కించుకుంది. ఆ తర్వాత కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.

Also read:అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ల మీటింగ్‌లో కేటీఆర్

 అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలను యువ నేత కేటీఆర్  కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ పార్లమెంట్ స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో నేతలను సమన్వయం చేస్తూ ఎన్నికలకు ఇంచార్జ్ గా వ్యవహరించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను పార్టీ సాధించినా విపక్ష పార్టీల కంటే అధికంగానే స్థానాలు గెలుచుకొని తెలంగాణలో పట్టు తమ.పట్టు నిరూపించుకో గలిగింది.

 అనంతరం జరిగిన స్థానిక సంస్థలు,మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలను స్వీప్ చేసింది. స్థానిక సంస్థల్లో 32 జడ్పీ స్థానాలను అధికార పార్టీ దక్కించుకుంది.

మున్సిపాలిటీ ల్లో  విపక్ష పార్టీలను సింగిల్ డిజిట్ కే పరిమితం చేయగలిగింది.  మరో నాలుగేళ్లు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఇదే సరైన సమయమని పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.

 ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేటీఆర్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి పదోన్నతి కల్పిస్తారన్న ప్రచారం కూడా ప్రస్తుతం  పార్టీ నేతల్లో జోరుగా  జరుగుతోంది.ఏ పదవి నిర్వహించినా తన సమర్థతను చాటుకున్న కేటీఆర్ అధికార పార్టీలో తన పట్టును పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు.

కెసిఆర్ కుమారుడిగా దక్కిన అవకాశాన్ని సద్వినియోగం. చేసుకుని తన సమర్థతను చాటుకున్నారని పార్టీ నేతలు  వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.