Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి కేటీఆర్ వార్నింగ్

జీహెచ్ఎంసీలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  చూడాల్సిందిగా కోరారు.
 
Ktr orders to punish if anyone violate lockdown rules in hyderabad
Author
Hyderabad, First Published Apr 14, 2020, 5:58 PM IST

హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  చూడాల్సిందిగా కోరారు.

మంగళవారం నాడు  మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ లు జీహెచ్ఎంసీలో కరోనాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ, మేయర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్,  ఆరోగ్య శాఖ సెక్రెటరీ శాంతికుమారి, మెడికల్, పోలీస్  జీ హెచ్ ఎం సి జోనల్ అధికారులు పాల్గొన్నారు.

 కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం ఒకటే మార్గమని మంత్రి చెప్పారు.ముఖ్యంగా హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా చూడాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి వచ్చే అన్ని దారులను మూసివేయాలన్నారు. 

 నిత్యావసర వస్తువులు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలని, సభలు, సమావేశాలు అటువంటి సామూహిక పంపిణీ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో చేపటరాదని ఆయన కోరారు.  ఎవరైనా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అనుకుంటే పోలీస్ లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు.


ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకొని అనుమానితులను హాస్పిటల్ కు తరలించాలని మంత్రి సూచించారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్  రిపోర్ట్ వస్తే సంబంధిత హాస్పిటల్ కు పంపించడంతో పాటు ట్రావెల్ హిస్టరీ వివరాలతో పాటు, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించాలని మంత్రి కోరారు.

 రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైనే రావొద్దని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి. 

 అధికారులు, డాక్టర్లు సమన్వయంతో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో అప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు.

 అవసరమైన అంబులన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలని ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే అటువంటి అనుమానితులను వెంటనే ఆసుపత్రికి పంపించాలని ఆయన సూచించారు.

 చీఫ్ సెక్రెటరీ సోమేషకుమార్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ప్రాంతంలో  అన్ని ప్రాంతాల్లో పోలీస్, మెడికల్ మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అనుమానితులను క్వారంటీన్ చేయడం లేదా హాస్పిటల్స్ కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా  ఆయన తెలిపారు. 
also read:కరోనా ఎఫెక్ట్: ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లపై రోగుల దాడి

ఎవరైనా ఎవరికైనా అనుమానితులు లేదా వైద్య సేవలు కావాలలంటే 104 లేదా జీహెచ్ఎంసి లోని 040 21111111 నెంబర్ కి కాల్ చేసి వైద్య లేదా ఇతర అత్యవసర సర్వీస్ ల  కోసం ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సీపీలు అంజనికుమార్, సజ్జనార్ మరియు మహేష్ భగవత్, డైరెక్టర్ మెడికల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


 
Follow Us:
Download App:
  • android
  • ios