కేటీ రామారావు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కలిశారు. బుధవారం సాయంత్రం ఆయన లక్నోలో అఖిలేష్ కలిశారు.

హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కలిశారు. బుధవారం సాయంత్రం ఆయన లక్నోలో అఖిలేష్ కలిశారు. 

తమ ఇద్దరి ఫొటోలను కేటీఆర్ ట్విటర్ లో పోస్టు చేసి అఖిలేష్ యాదవ్ భేటీపై ఆనందం వ్యక్తం చేశారు. దానిపై పలు ప్రశ్నలు ముందుకు వచ్చాయి. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చ కోసం అఖిలేష్ యాదవ్ తో సమావేశమయ్యారా అని ట్విటర్ లో పలువురు ఆయనను ప్రశ్నించారు. 

ఫెడరల్ ఫ్రంట్ లోకి అఖిలేష్ యాదవ్ ను ఆహ్వానించాలని కొందరు అభిప్రాయపడగా, మరికొంత మంది వ్యతిరేకించారు. మీ సమావేశం బాగుందని, తాము ఫెడరల్ ఫ్రంట్ కోసం ఎదురు చూస్తున్నామని ఓ యూజర్ అన్నారు. 

కొత్త తరం నాయకత్వాన్ని తాము ఇష్టపడుతామని, అయితే ఆ భేటీ ఫెడరల్ ఫ్రంట్ కాదని భావిస్తున్నామని, యుపి రాజకీయాలు కులమత ప్రాతిపదికపై నడుస్తాయని, అది తెలంగాణలో వద్దని ఓ యూజర్ అన్నారు. 

అయితే, అఖిలేష్ యాదవ్ తో భేటీకి సంబంధించిన వివరాలను కేటిఆర్ వెల్లడించలేదు. శుక్రవారం టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో ఆ భేటీ జరిగింది.