కంటోన్మెంట్ రోడ్డు సమయం పొడగింపుపై వినతి

కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌తో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అధికారులు పాల్గొన్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో రహదారులు, పలు అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో రెండు ఆకాశహర్మ్యాల ఏర్పాటుకు రక్షణశాఖ స్థలాలు కోరినట్లు చెప్పారు. రెండు ఆకాశహర్మ్యాల నిర్మాణానికి వందెకరాలు అవసరమని తెలిపారు. కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత సమయాన్ని పెంచాలని కోరామని, 100 అడుగుల మేర రోడ్ల విస్తరణ చేపడతామని వెల్లడించారు. రక్షణశాఖ స్థలాలకు బదులు మరో చోట స్థలం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపామని కేటీఆర్‌ వివరించారు.