హైదరాబాద్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు బిజెపి నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బిజెపికి రాజీనామా చేసిన రావుల శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరిన సందర్బంగా సోమవారం ఆయన ప్రసంగించారు. కేంద్రానికి తాము 2.72 లక్షలు పన్నుల రూపంలో ఇచ్చామని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది లక్,ా 29 వేల కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. నోట్ల రద్దుతో అభివృద్ధి ఆగిపోయిందని ాయన విమర్శించారు. 

మతం తమ ప్రచారాస్త్రం కాదని, దేశభక్తి తమకే ఎక్కువగా ఉందని కేటీర్ అన్నారు. ప్రతి మతానికీ తెలంగాణలో చోటు ఉందని ఆయన అన్నారు. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో చోటు లేదని అన్నారు. తాము ఏం చేశామో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆరేళ్లలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ దే విజయమని అన్నారు. 

బిజెపి నేతలు ప్రజల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రెచ్చగొట్టే మాటలు ధర్మం కాదని అన్నారు. ప్రజలు అడుగడుగునా కేసీఆర్ నాయకత్వానికి జైకొడుతున్నారని ఆయన అన్నారు. 

రాష్ట్ర భవిష్యత్తు కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిణామాలను పరిశీలించిన తర్వాత టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. దుబ్బాక చైతన్యవంతమైన ప్రజాక్షేత్రమని, రేపు జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన అన్నారు. 

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచి తీరుతుందని ఆయన అన్నారు.