Asianet News TeluguAsianet News Telugu

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటేయాలి: టీఆర్ఎస్ కార్పోరేటర్ల సమావేశంలో కేటీఆర్

పార్టీ నిర్ణయానికి కట్టుబడి కార్పోరేటర్లంతా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటేయ్యాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్పోరేటర్లను కోరారు.

KTR key comments in TRS corporators meeting lns
Author
Hyderabad, First Published Feb 11, 2021, 10:42 AM IST

హైదరాబాద్: పార్టీ నిర్ణయానికి కట్టుబడి కార్పోరేటర్లంతా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటేయ్యాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్పోరేటర్లను కోరారు.

గురువారం నాడు ఉదయం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ కార్పోరేటర్లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం చాలా మంది పోటీ పడినట్టుగా కేటీఆర్ చెప్పారు.

also read:జీహెచ్ఎంసీ మేయర్ పదవికి బీజేపీ పోటీ: అభ్యర్ధి రాధా ధీరజ్ రెడ్డి

పార్టీ అవసరాల రీత్యా ఈ పదవుల విషయంలో నాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని ఆయన చెప్పారు.పార్టీ ఏ నిర్ణయం తీసుకొన్నా కూడ కార్పోరేటర్లంతా పాటించాలని కేటీఆర్ కోరారు.మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పేర్లను సీల్డ్ కవర్లో పార్టీ నాయకత్వం అందించనుందని కేటీఆర్ చెప్పారు.

KTR key comments in TRS corporators meeting lns

అందరికీ పదవులు వస్తాయని కేటీఆర్ హామీ ఇచ్చారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే ఆయా ఎమ్మెల్యేలతో తన వద్దకు వస్తే వాటిని పరిష్కరించనున్నట్టుగా కేటీఆర్ కార్పోరేటర్లకు హామీ ఇచ్చారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ నుండి టీఆర్ఎస్ కార్పోరేటర్లంతా  ప్రత్యేక బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొన్నారు.

KTR key comments in TRS corporators meeting lns

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకొంటామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఈ ఎన్నికలకు  టీఆర్ఎస్ పార్టీ పరిశీలకులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లు కె. కేశవరావు, సంతోష్ కుమార్ లను టీఆర్ఎస్ నియమించింది.

Follow Us:
Download App:
  • android
  • ios