Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పథకాలను కాపీకొడుతున్న రాష్ట్రాలు: హెచ్ఐసీసీలో ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్

ఈనెల 25న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో పాటు, పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను కేటీఆర్ గురువారం నాడు పరిశీలించారు. పలు కమిటీలన కేటీఆర్ ప్రకటించారు. ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరు కావాలని ఆయన కోరారు.

KTR inspects trs plenary arrangements at Hicc in Hyderabad
Author
Hyderabad, First Published Oct 14, 2021, 1:41 PM IST

హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన Trs రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికతో పాటు పార్టీ plenary ఏర్పాటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Ktr ప్రకటించారు.గురువారం నాడు Hiccలో ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. భద్రత, పారిశుద్య ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. 

also read:నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన సభ:కేటీఆర్

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిర్వహించే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో పాటు ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.హైద్రాబాద్ నగర అలంకరణకు నాలుగు కమిటీలను  ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. పక్క రాష్ట్రాల జిల్లాల ప్రజలు తమను Telanganaలో కలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్నారు.

అభివృద్ది సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం  దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ చెప్పారు.రైతు బంధును అనుసరించి కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని తెచ్చిందని ఆయన తెలిపారు.మిషన్ భగీరథ పథకాన్ని జల్ జీవన్ మిషన్ పేరుతో కేంద్రం అమలు చేస్తోందన్నారు.సింగిల్ విండో పద్దతిని అనుసరించి ఇన్వెస్ట్ ఇండియాను కేంద్రం ప్రవేశపెట్టిందని కేటీఆర్ తెలిపారు. 

KTR inspects trs plenary arrangements at Hicc in Hyderabad

ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు వాలంటీర్ల కమిటీ, పార్కింగ్, భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, మీడియా కమిటీల‌తో పాటు ఇత‌ర క‌మిటీల‌ను కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందిస్తామ‌న్నారు. పార్టీ ఆహ్వానించిన వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

KTR inspects trs plenary arrangements at Hicc in Hyderabad

టీఆర్ఎస్  రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నెల 22వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ నెల 23న నామినేషన్ల స్క్యూట్నీ నిర్వహిస్తారు.ఈ నెల 25న అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజున హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios