తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో(KTR Paris Tour)  ఉన్నారు. ఈ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను పారిస్‌లో ఓ అనుకోని ఆత్మీయ  అతిథి కలిశారు. అతనే ఫ్రెంచ్‌కు చెందిన డానియేల్‌ నెగర్స్‌. నెగర్స్ (Daniel Negers).

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో(KTR Paris Tour) ఉన్నారు. ఈ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను పారిస్‌లో ఓ అనుకోని ఆత్మీయ అతిథి కలిశారు. అతనే ఫ్రెంచ్‌కు చెందిన డానియేల్‌ నెగర్స్‌. నెగర్స్ (Daniel Negers).. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాషపై పరిశోధనచేయడమే కాకుండా.. తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్‌కి చెందిన దక్షిణాసియా మరియు హిమాలయన్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు.

డానియేల్ నెగర్స్.. ఆదివారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేగర్స్ తెలుగు అద్భుతంగా మాట్లాడం చూసిన కేటీఆర్ ఆశ్చర్యానికి గురయ్యారు. గత కొన్నేళ్లుగా తెలుగుపై తన పరిశోధన వివరాలను కేటీఆర్‌కు వివరించారు. ‘వేల మైళ్ల దూరాన ఉండి కూడా మీరు తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకం’ అని కేటీఆర్‌ డానియేల్ నెగర్స్‌ను ప్రశంసించారు.

Also read: గుడ్ న్యూస్.. హైదరాబాద్‌కు మరో ప్రముఖ సంస్థ.. భారత్‌లో తొలి కేంద్రం ఇక్కడే.. కేటీఆర్‌తో భేటీ తర్వాత ప్రకటన

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేటీఆర్.. అభివృద్దిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడులతో వస్తే ఫ్రెంచ్‌ ఎస్‌ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. శుక్రవారం పారిస్‌లో ‘యాంబిషన్‌ ఇండియా 2021’ బిజినెస్‌ ఫోరంలో కీలకోపన్యాసం చేశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును మంత్రి వివరించారు. పరిశ్రమలకు భూముల కేటాయింపు, సత్వర అనుమతులు, నాణ్యమైన మానవ వనరులు, వనరుల సేకరణ తదితర అంశాలను సెనేట్‌లో వివరించారు.

Scroll to load tweet…

ఇక, కేటీఆర్‌ శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక పరిశోధన సంస్థ ప్లగ్‌ అండ్‌ (Plug and Play) ప్లే ప్రతినిధులతో ఆ దేశ సెనేట్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు ఎలా కేంద్రంగా మారుతున్నదో వివరించారు. హైదరాబాద్‌లో టెక్‌ కేంద్రాన్ని ప్రారంభించాలని ఆ సంస్థ వెంటనే నిర్ణయం తీసుకొన్నది. వచ్చే డిసెంబర్‌ మొదటివారంలో మంత్రి కేటీఆర్‌, ప్లగ్‌ అండ్‌ పే వ్యవస్థాపక సీఈవో సయీద్‌ అమీది సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. భారత్‌లో ప్లగ్ అండ్ ప్లే సంస్థకు ఇదే తొలి కేంద్రం.