Asianet News TeluguAsianet News Telugu

సివిల్స్ ర్యాంకర్ శ్రీజకు మంత్రి కేటీఆర్ సర్ ఫ్రైజ్.. నిమిషాల్లో బదిలీ...

మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని మంత్రి.. శ్రీజను ప్రశ్నించగా తండ్రి ప్రైవేటు ఉద్యోగి అని, తల్లి ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా వరంగల్ లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మీరుండేది హైదరాబాద్ లో.. అమ్మ నిత్యం వరంగల్ వెళ్లి పనిచేస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR helps : job transfer to the Civils Ranker mother took place within minutes
Author
Hyderabad, First Published Dec 1, 2021, 7:36 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పహాడీ షరీఫ్ : మంత్రి KTR చొరవతో ఓ సివిల్స్ ర్యాంకర్ తల్లికి ఉద్యోగ బదిలీ నిమిషాల్లో జరిగిపోయింది. అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకు సాధించి సివిల్స్ కు ఎంపికైన Dr. Shreeja.. తన తండ్రితో కలిసి మంగళవారం Pragatibhavan లో మంత్రి కేటీఆర్ ను కలిశారు. అనేక పరిమితులు ఉన్ప్పటికీ అత్యంత ప్రతిభా పాటవాలతో విజయం సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచావని కేటీఆర్ ప్రశంసించారు. 

మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని మంత్రి.. శ్రీజను ప్రశ్నించగా తండ్రి ప్రైవేటు ఉద్యోగి అని, తల్లి ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా వరంగల్ లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మీరుండేది హైదరాబాద్ లో.. అమ్మ నిత్యం వరంగల్ వెళ్లి పనిచేస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

నాలుగేళ్లుగా ఆమె transferకి విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదని శ్రీజ వాపోయారు. ఆ విసక్ష్ం తాను చూస్తానని మంత్రి పేర్కొన్నారు. శ్రీజ ఇంటికి వెళ్లేసరికి తల్లికి నగరానికి బదిలీ అయిందన్న సంతోషకర సమాచారం తెలిసింది. 

కాగా, నవంబర్ 27న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2020 తుది పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను ఐటీ శాఖమంత్రి KTR అభినందించారు. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మేఘన తన తండ్రి టీఎస్ఎస్ పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్) కె. రాములుతో శుక్రవారం ప్రగతిభవన్ కు వెళ్లి కేటీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు. నేటి యువతరం మేఘనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. 

ఇదిలా ఉండగా, పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ తన మంచిమనసు చాటుకున్నారు. వరంగల్ జిల్లా హసన్ పర్తికి చెదన మేకల అంజలికి తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఆర్థిక సహాయం అందించారు. అంజలి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఆమెకు కేటీఆర్ ఫీజుతో పాటు ఇతర ఖర్చుల కోసం, లాప్ టాప్ కోసం లక్ష 50 వేర రూపాయలను అందించారు. 

నిరుడు హసన్ పర్తి లోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అంజలి ఐఐటీలో ర్యాంక్ సాధించింది. తన కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు ఆర్థిక సహాయం చేయాలని అంజలి కేటీఆర్ కు విజ్ఢప్తి చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె కేటీఆర్ కు ఆ విజ్ఢప్తి చేసింది. వెంటనే స్పందించిన కేటీఆర్ గత సంవత్సరం ఫీజుల నిమిత్తం కూడా ఆర్థిక సాయం చేశారు. 

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్... ఇద్దరు యువకులను కాపాడి

అదే క్రమంలో నవంబర్ 17న కూడా ఓ సంఘటన జరిగింది. తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురయిన ఇద్దరు యువకులు గాయాలతో పడివుండగా వారిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బిజీ పనులను పక్కనపెట్టి సాటిమనిషి ప్రాణాలకే ఎక్కువ విలువిచ్చి క్షతగాత్రులను కాపాడిన మంత్రి కేటీఆర్ ను ప్రజలు అభినందిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  మియాపూర్ కు చెందిన పవన్, నగేష్ పనిమీద బుధవారం, నవంబర్ 17న శామీర్ పేటకు బైక్ పై వెళ్లారు. ఈ క్రమంలో పని ముగించుకుని రాత్రి మియాపూర్ కు తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. హకీంపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు.  

అయితే ఇదే సమయంలో minister KTR కాన్వాయ్ అటువైపు వచ్చింది. రోడ్డుపై గాయాలతో పడివున్న యువకులను చూసి చలించిపోయిన మంత్రి వెంటనే తన కారును నిలిపారు. గాయపడిన యువకుల పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి వెంటనే భద్రత సిబ్బంది సాయంతో యువకులిద్దరిని కాపాడారు. 

తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో గాయపడిని ఇద్దరు యువకులను హాస్పిటల్ కు తరలించారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం యువకులిద్దరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరు యువకులు ప్రాణాలను కాపాడిన  మంత్రిపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios