మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్... ఇద్దరు యువకులను కాపాడి
రోడ్డుపై గాయాలతో పడివున్న ఇద్దరు యువకులను కాపాడి మంత్రి కెటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా క్షతగాత్రులను కాపాడి ఆపద్భాందవుల్లా మారారు.
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురయిన ఇద్దరు యువకులు గాయాలతో పడివుండగా వారిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బిజీ పనులను పక్కనపెట్టి సాటిమనిషి ప్రాణాలకే ఎక్కువ విలువిచ్చి క్షతగాత్రులను కాపాడిన మంత్రి కేటీఆర్ ను ప్రజలు అభినందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మియాపూర్ కు చెందిన పవన్, నగేష్ పనిమీద బుధవారం శామీర్ పేటకు బైక్ పై వెళ్లారు. ఈ క్రమంలో పని ముగించుకుని రాత్రి మియాపూర్ కు తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. హకీంపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు.
అయితే ఇదే సమయంలో minister KTR కాన్వాయ్ అటువైపు వచ్చింది. రోడ్డుపై గాయాలతో పడివున్న యువకులను చూసి చలించిపోయిన మంత్రి వెంటనే తన కారును నిలిపారు. గాయపడిన యువకుల పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి వెంటనే భద్రత సిబ్బంది సాయంతో యువకులిద్దరిని కాపాడారు.
read more సిరిసిల్లలో ఘోరప్రమాదం... మానేరు వాగులో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి, ముగ్గురు సురక్షితం (వీడియో)
తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో గాయపడిని ఇద్దరు యువకులను హాస్పిటల్ కు తరలించారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం యువకులిద్దరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరు యువకులు ప్రాణాలను కాపాడిన మంత్రిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదిలావుంటే బుధవారం మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా మానవత్వాన్ని ప్రదర్శించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబాన్ని స్వయంగా తన కారులో హాస్పిటల్ కు తరలించారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బైక్ పై చిన్నారి కూతురితో సహా వెళుతున్న దంపతులు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఈ సమయంలో అదే మార్గంలో వెళుతున్న komatireddy venkatreddy గాయాలతో రోడ్డుపై పడివున్న కుటుంబాన్ని గమనించారు. వెంటనే తన కారును నిలిపి గాయపడిన దంపతులతో పాటు చిన్నారిని ధైర్యం చెప్పి తన కారులోనే హాస్పిటల్ కు తరలించారు.
read more మెదక్ జిల్లాలో విషాదం... కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలతో కన్నతల్లి ఆత్మహత్య
ఇక చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాద బాధితులను కాపాడారు. ఆయన హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తుండగా మల్కాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగ్గా గాయాలతో పడివున్న వారిని గమనించారు. ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటోలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో వెంటనే తన కారును నిలిపి క్షతగాత్రుల వద్దకు వెళ్లారు MP Ranjith Reddy. ఐదురుగు తీవ్రంగా గాయపడగా వెంటనే అంబులెన్స్ కు తెప్పించి వారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం , క్షతగాత్రులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ తన మంచిమనసు చాటుకున్నారు. వరంగల్ జిల్లా హసన్ పర్తికి చెదన మేకల అంజలికి తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఆర్థిక సహాయం అందించారు. అంజలి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఆమెకు కేటీఆర్ ఫీజుతో పాటు ఇతర ఖర్చుల కోసం, లాప్ టాప్ కోసం లక్ష 50 వేర రూపాయలను అందించారు.
నిరుడు హసన్ పర్తి లోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అంజలి ఐఐటీలో ర్యాంక్ సాధించింది. తన కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు ఆర్థిక సహాయం చేయాలని అంజలి కేటీఆర్ కు విజ్ఢప్తి చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె కేటీఆర్ కు ఆ విజ్ఢప్తి చేసింది. వెంటనే స్పందించిన కేటీఆర్ గత సంవత్సరం ఫీజుల నిమిత్తం కూడా ఆర్థిక సాయం చేశారు.