కోమాలోకి వెళ్లిన కండక్టర్: వాట్సాప్ పోస్టుకు స్పందించి ప్రాణాలు కాపాడిన కేటీఆర్

KTR helps for Conductor's operation
Highlights

తెలంగాణ ఐటి మంత్రి కేటి రామారావు వాట్సాప్ పోస్టుకు స్పందించి ఓ కండక్టర్ కు అవసరమైన సాయాన్ని అందించారు. 

కరీంనగర్: తెలంగాణ ఐటి మంత్రి కేటి రామారావు వాట్సాప్ పోస్టుకు స్పందించి ఓ కండక్టర్ కు అవసరమైన సాయాన్ని అందించారు. హైబీపీతో నరాలు చితికి కోమాలోకి వెళ్లి కండక్టర్ రమేష్ ను రక్షించాలని కోరుతూ బంధువులు కేటీఆర్ కు వాట్సాప్ పోస్టు పెట్టారు. 

వెంటనే స్పందించిన కేటీఆర్ మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడి ఆపరేషన్ చేయించారు. ఈ విషయం సోమవారంనాడు వెలుగులోకి వచ్ిచంది. సిరిసిల్ల పట్నం వెంకంపేటకు చెందిన బేరుగు రమేష్ వేములవాడ ఆర్టీసి డీపోలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. 

రమేష్ హైబీపీతో సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను వెంటనే హైదరాబాదులోి మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యపరీక్షల అనంతరం 12 గంటల లోపల శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పారు. 

సర్జరీ రూ.16 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దాంతో బంధువులు ఆశలు వదిలేసుకున్నారు. అయితే చివరి ప్రయత్నంగా మంత్రి కేటీఆర్ కు వాట్సాప్ లో సమస్య గురించి వివరిస్తూ పోస్టు పెట్టారు. 

దానికి వెంటనే స్పందించిన కేటీఆర్ ఆర్టీసి ఉన్నతాధికారులతో, మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి సీఈవోతో మాట్లాడి వెంటనే ఆపరేషన్ జరిగేలా చూశారు. దాంతో రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు. 

loader