హైదరాబాద్:  వరంగల్ జిల్లా హసన్ పర్తికి చెదన మేకల అంజలికి తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఆర్థిక సహాయం అందించారు. అంజలి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. 

ఆమెకు కేటీఆర్ సోమవారంనాడు ఫీజులు ఇతర ఖర్చుల కోసం, లాప్ టాప్ కోసం లక్ష 50 వేర రూపాయలను అందించారు. నిరుడు హసన్ పర్తి లోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అంజలి ఐఐటీలో ర్యాంక్ సాధించింది. 

తన కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు ఆర్థిక సహాయం చేయాలని అంజలి కేటీఆర్ కు విజ్ఢప్తి చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె కేటీఆర్ కు ఆ విజ్ఢప్తి చేసింది. వెంటనే స్పందించిన కేటీఆర్ గత సంవత్సరం ఫీజుల నిమిత్తం కూడా ఆర్థిక సాయం చేశారు. 

అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో పూర్తి ఐఐటీ విద్య కోసం అవసరమైన నిధులను వ్యక్తిగతంగా అందిస్తానని మంత్రి నిరుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు అంజలి రెండవ సంవత్సరానికి సంబందించిన ఖర్చులకు సంబంధించిన డబ్బులను ప్రగతిభవన్ లో అంజలికి అందించారు. కేటీఆర్ చేసిన సాయానికి అంజలి ధన్యవాదాలు తెలిపారు.