టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం అందించారు. ఆ సాయంతో చిన్నారిని తిరిగి ఊపిరి పీల్చుకోగలుగుతోంది. కేటీఆర్ సాయంతంతో  చిన్నారి కోలుకుంటోందన్న విషయాన్ని ఆ చిన్నారి తండ్రి తెలియజేశారు.

ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నేను దృష్టిసారించాల్సిన, హాజరుకావాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ చిన్నారి నవ్వు ఎంతో విలువైనది. ఆమె కోలుకుంటోందన్న సందేశం ప్రజాజీవితాన్ని విలువైనదిగా మార్చింది’ అని ట్వీట్‌ చేశారు.  కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

ఇంటర్నెట్ లోనే ఈ రోజు బెస్ట్ ట్వీట్ ఇది అంటూ.. ఓ నెటిజన్ పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన మంచి పనికి నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు.