తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు సాధించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు.. జనవరి 1వ తేదీ నుంచి రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీన తెలంగాణలో న్యాయమూర్తులు.. ప్రమాణ స్వీకారం కూడా చేశారు.

కాగా.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, ఎంపీల కారణంగానే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు వచ్చిందని ఆయన అన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు సాధించేందుకు కృషి చేసిన న్యాయవాదులకు ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ గా నియమితులైన భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ కి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.