Asianet News TeluguAsianet News Telugu

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు.. కేటీఆర్

జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల‌కు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని కోరారు.

KTR Comments at winners of Swachh Survekshan 2022 Awards at MCRHRD Campus
Author
First Published Oct 4, 2022, 4:30 PM IST

జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల‌కు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని కోరారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన మున్సిపాలిటీల‌ ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన మున్సిపాలిటీ.. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని చెప్పారు. 

దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించి రెండో స్థానంలో తెలంగాణ నిలిచింద‌న్నారు. పారిశుద్ధ్య కార్మికురాల నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి దాక అందరూ కలిసి ఒకే రకమైన ఆలోచన విధానంతో పనిచేయడం వల్లనే ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. దేశంలోని 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం చెబుతుందని.. పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తే దేశంలో రెండో స్థానంలో తెలంగాణలో నిలిచిందని చెప్పారు. ఈ గణంకాలలతో దేశంలో అత్యుత్తమమైన రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెబుతుందని అన్నారు. కానీ కేంద్రంలోని నాయకులే తెలంగాణ పరిపాలన బాగా లేదని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అలాంటి అసత్యాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

తెలంగాణ కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేసిన 19 మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల చొప్పును మంజూరు చేయనున్నట్టుగా చెప్పారు. బాగా పని చేస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో మనకంటే మెరుగైన మున్సిపాలిటీలకు స్టడీ టూరుకు పంపుతామని చెప్పారు. ఇక, రాష్ట్రం నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన జాబితాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, తుర్కయాంజాల్, గ‌జ్వేల్, వేముల‌వాడ‌, బ‌డంగ్‌పేట్, కోరుట్ల‌, సిరిసిల్ల‌, ఘ‌ట్‌కేస‌ర్‌, కొంప‌ల్లి, హుస్నాబాద్, ఆదిభ‌ట్ల‌, కొత్త‌ప‌ల్లి, చండూర్, నేరేడుచ‌ర్ల‌, చిట్యాల‌, భూత్‌పూర్, అలంపూర్, పీర్జాదిగూడ‌, కోరుట్ల‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios