Asianet News TeluguAsianet News Telugu

హ్యాపీ బర్త్ డే అక్క... మంత్రి సత్యవతి రాథోడ్ కి కేటీఆర్ శుభాకాంక్షలు

మంచి ఆరోగ్యం,  సంతోషం, శాంతి ఆమెకు జీవితాంతం ఆమెకు లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ పోస్టులో సత్యవతి రాథోడ్ ని కేటీఆర్ అక్క అని బోధించడం విశేషం. కాగా... మంత్రికి పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు కూటా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

KTR BirthDay Wishes to Minister Satyavathi Rathode
Author
Hyderabad, First Published Oct 31, 2019, 11:27 AM IST

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కాగా... ఆమెకు తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా సత్యవతి రాథోడ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన కేటీఆర్.. ఆమెకు విషెస్ తెలియజేశారు. మంచి ఆరోగ్యం,  సంతోషం, శాంతి ఆమెకు జీవితాంతం ఆమెకు లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ పోస్టులో సత్యవతి రాథోడ్ ని కేటీఆర్ అక్క అని బోధించడం విశేషం. కాగా... మంత్రికి పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు కూటా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్ లోని త్రిఆర్ కాలువలో నీరు సరిగా రావడం లేదని, కొన్ని మరమ్మతులు చేయాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. 

అనంతరం తానంచర్ల గ్రామంలోని గంగా భవాని గుడిలో పూజలు చేశారు.అక్కడి నుంచి  తానంచర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడ వాల్యా తండాలో పిడుగుపాటుకు గురై చనిపోయిన తండ్రి, కొడుకులు కిషన్ తేజావత్(41), సంతోష్ తేజావత్(14) కుటుంబ సభ్యులను పరామర్శించారు. సానుభూతి తెలిపారు. 

వారి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని, ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం వెంటనే అందేలా అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. వారి వ్యవసాయ భూమికి వెంటనే పట్టాలు ఇస్తారని, రైతు బంధు పథకం వర్తిస్తుందని హామీ ఇచ్చారు. తండ్రి కొడుకులు మరణించిందున వారికి ఆపద్బాందు పథకం కింద 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందుతుందని హామీ ఇచ్చారు. వారిని పరామర్శిస్తున్న సమయంలో వారి బాధలను విని మంత్రి కూడా కన్నీరు పెట్టుకున్నారు.

అనంతరం జాల్ తండాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మరొక కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భర్తను కోల్పోయిన మహిళకు తగిన న్యాయ సాయం అందించాలని పోలీసులను ఆదేశించారు. చిన్న గూడూరు లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రాజు  తల్లి చనిపోవడంతో ఆమెకు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యాన్ని కోల్పోవద్దని, తాను అండగా ఉంటానని రాజుకు భరోసా ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios