ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  

‘‘ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.  ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని. ఎక్కువ కాలం ప్రజా సేవలో గడాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

 చంద్రబాబు నాయుడుతోపాటు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర కి కూడా కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా ఆయనకు కూడా ట్విట్టర్ లో కేటీఆర్ విషెస్ తెలిపారు.