Asianet News TeluguAsianet News Telugu

చెల్లె కల్వకుంట్ల కవితకు ముద్దుపేరుతో కేటీఆర్ బర్త్ డే విషెస్

చెెల్లె కల్వకుంట్ల కవితకు సోదరుడు కేటీ రామారావు వెరైటీ బర్త్ డే విషెస్ చెప్పారు. బాల్యంలోని కవిత ముద్దుపేరుతో ఆయన ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులో ఆమె బర్త్ డే వేడుకలు శుక్రవారంనాడు జరిగాయి.

KTR birth day wishes to sister Kalvakuntla Kavitha
Author
Hyderabad, First Published Mar 13, 2020, 5:16 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వెరైటీ బర్త్ డే విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన కవితకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కవిత ముద్దుపేరును పెట్టి ఆయన ఆ శుభాకాంక్షలు తెలిపారు. 

"హ్యాపీ బర్త్ డే పప్" అంటూ కవిత చిన్నప్పటి ముద్దు పేరుతో ట్వీట్ చేశారు. "నీ జీవితంలో సంతోషం నిండాలి. మంచి ఆరోగ్యం, సుఖశాంతులు ఉండేలా దీవెనలు లభించాలని కోరుకుంటున్నా" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

కల్వకుంట్ల కవిత శుక్రవారం తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అసెంబ్లీ లోని ఉప సభాపతి పద్మారావు ఛాంబర్ లో ఘనంగా కవిత జన్మదిన వేడుకలు జరిగాయి. 
తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.  

కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ - తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో సైతం కవిత చాటి చెప్పారని, బతుకమ్మ ప్రత్యేకతను, బోనాలు విశిష్టతను అందరూ గుర్తించేలా కృషి చేశారని  ప్రశంసించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్యేల్యీలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత జన్మదిన పురస్కరించుకొని రాజ్ భవన్ గవర్నమెంట్ పాఠశాలలో ఆవరణంలో  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. దానితో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ స్ఫూర్తితో మొక్కలు నాటి మరియు 1000 మంది విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు నాటే విదంగా ప్రతిజ్ఞ చెయ్యటం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాజీవ్ సాగర్; నవీనా చారి ;శ్రీనివాస్; హైదరాబాద్ గ్రంధాలయం చైర్మన్ ప్రసన్న,  జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios