Asianet News TeluguAsianet News Telugu

గిరిజనుల కోసమే ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్..: కేటీఆర్ 

తెలంగాణలో గిరిజనుల అభివృద్దికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తోందని ఐటి, పరిశ్రామిక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. 

KTR  Attends CMSTEI Tribal Enterpreneurs successmeet AKP
Author
First Published Nov 2, 2023, 2:16 PM IST

హైదరాబాద్ : కేవలం గిరిజనుల కోసమే ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు డిమాండ్ పై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆసక్తి కలిగిన గిరజనుల యువతక కోసం ఇప్పటికే సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే గిరిజన పారిశ్రామిక పార్క్ ఏర్పాటుపై  సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని... దీనిపై సానుకూలంగా ఆలోచనతో ముందుకు వెళతామని కేటీఆర్ తెలిపారు. 

గురువారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో CMSTEI స్కీమ్ ద్వారా వ్యాపారాలు ప్రారంభించినవారి సక్సెస్ మీట్ లో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ పాల్గోన్నారు. గిరిజన యువత ప్రారంభించిన వ్యాపారాల గురించి తెలుసుకుని వారిని అభినందించారు. 

 ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... దేవుడు మనిషిని పుట్టిస్తే ఆ మనిషి కులాన్ని పుట్టించాడని అన్నారు. అయితే కులంతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయన్నారు. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తుకాదని తాను బలంగా నమ్ముతానని అన్నారు. సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని గిరిజన యువతకు మంత్రి సూచించారు. 

Read More  రైతుల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ.. : కేటీఆర్

ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలని... కలల్ని సైతం గొప్పగా కనాలని కేటీఆర్ సూచించారు. ఇలాగైతేనే జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకునే స్ఫూర్తి కలుగుతుందన్నారు. సీఎంఎస్టిఈఐ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించిన 500 గిరిజన సోదరులు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలని మంత్రి సూచించారు. గ్రామాలు, గిరిజన తండాల్లో, ఆదివాసీ గుడాలలో ఉన్న యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమం ఉందన్నారు. 
 
గత ఐదు సంవత్సరాల్లో ఈ కార్యక్రమం నడిచిన తీరుపైన అధ్యయనం నిర్వహించి దీన్ని మరింతగా బలోపేతం చేసి, విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. 500 మంది ఉన్న ఔత్సాహిక పెట్టుబడిదారుల సంఖ్యను ఐదువేలకు చేరేలా కార్యాచరణ నిర్వహించుకుందామని మంత్రి కేటీఆర్ సూచించారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios