తెలంగాణ రాష్ట్ర సమితి కార్యానిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆయన కార్యానిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అంతకు ముందు ఆయన తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. సోదరి, నిజామాబాద్ ఎంపీ కవిత ఆయనకు వీరతిలకం దిద్దారు. అనంతరం ఇంటి నుంచి తెలంగాణ భవన్ వరకు 20 వేల మంది కార్యకర్తలతో కేటీఆర్ భారీ ర్యాలీగా తరలివచ్చారు. కేటీఆర్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు