డబుల్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన.. పంపిణీ ఎప్పుడంటే..? 

Double Bedroom: డబుల్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్టు ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

ktr announced double bedroom houses to be distributed from august first week KRJ

Double Bedroom: డబుల్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.  హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని తెలిపారు.

ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయనీ, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు  ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి సంబంధించి జిహెచ్ఎంసి ఒక షెడ్యూల్ సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం నుంచి మద్దతు తీసుకొని ముందుకుపోనున్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మార్గదర్శకాలు మేరకు ఈ ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు.

జిహెచ్ఎంసి అధికారులతో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్ ని సిద్ధం చేసింది.

ఇప్పటిదాకా ఇన్ సిట్యూ (in -situ) ప్రాంతాల్లో నిర్మించినదాదాపు నాలుగువేల ఇండ్లకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు అందించింది. జిహెచ్ఎంసి రూపొందించిన  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ మూడవ వారం వరకు కొనసాగనున్నట్టు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios