ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్ ను హైద్రాబాద్ గురువారం నాడు హైద్రాబాద్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి వివాహాన్ని పురస్కరించుకొని గురువారం నాడు హైద్రాబాద్ లో రిసెప్షన్ నిర్వహించారు.ఈ రిసెప్షన్ లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బుధవారం నాడు ఖమ్మం జిల్లా వాసుల కోసం రిసెప్షన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలనే బాలిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహం జరిగింది.ఈ వివాహన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాకు చెందిన తన అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొనేందుకు వీలుగా బుధవారం నాుడు రిసెప్షన్ నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ నేత ఈటల రాజేందర్, వైఎస్ షర్మిల హాజరయ్యారు.
గురువారం నాడు హైద్రాబాద్ లో నిర్వహించిన రిసెప్షన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, వైఎస్ విజయమ్మ, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో ఖమ్మం ఎంపీగా వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పొంగుటేటి శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తెలంగాణలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ కేటాయించలేదు.టీడీపీ నుండి వచ్చిన నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించడంతో నామా నాగేశ్వరరావు ఖమ్మం నుండి ఎంపీగా విజయం సాధించారు. రాజ్యసభ సీటు వస్తుందని భావించినా కూడా శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి పదవిని ఇవ్వలేదు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగింది. కానీ ఈ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చిన విసయం తెలిసిందే.
